'అఖండ' విజయం దక్కినా బాలయ్య అదే తరహా !

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ మద్య కాలంలో ఏ సినిమా దక్కించుకోని 50 డేస్ రికార్డును అఖండ దక్కించుకుంది.

రెండు వందల కోట్ల రూపాయల వసూళ్లను దక్కించుకున్న అఖండ సినిమా ఇప్పుడు ఓటీటీ లో కుమ్మేస్తోంది.

త్వరలోనే బాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు కూడా అఖండ సినిమా వెళ్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అఖండ సినిమా ఇంతటి ఘన విజయం సాధించింది కనుక బాలయ్య పారితోషికం భారీగా పెంచేసి ఉంటాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

కాని ఆయన పారితోషికం విషయంలో అదే తరహా అన్నట్లుగా ముందుకు వెళ్తున్నాడట.ఇప్పుడు ఉన్న హీరోలు ఒక్క సినిమా సూపర్‌ హిట్ అయితే వెంటనే పదుల కోట్ల పారితోషికం పెంచుతున్నారు.

కాని బాలయ్య మాత్రం పారితోషికంను ఇరవై కోట్లకు మించి తీసుకోవడం లేదట.అది కూడా సినిమా మంచి విజయం సాధిస్తేనే ఆ స్థాయి పారితోషికం తీసుకుంటాడు.

"""/"/ ఒక వేళ సినిమా ప్లాప్‌ అయితే బాలయ్య పారితోషికం పది కోట్ల వరకు ఉంటుంది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

ప్రస్తుతం అఖండ సినిమా వసూళ్ల మోత గురించి చర్చ జరుగుతూనే ఉంది.ఇలాంటి సమయంలో ఆయన పారితోషికం పాతిక కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉందని భావించారు.

కాని తాజాగా ఆయన చేస్తున్న సినిమాలకు ఇంతకు ముందు తరహాలోనే పారితోషికం దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.

ఆయన హోస్టింగ్‌ చేసిన అన్‌ స్టాపబుల్‌ షో కు కూడా పారితోషికం నామమాత్రంగానే తీసుకున్నాడనే వార్తలు వస్తున్నాయి.

బాలయ్య సంపాదన విషయంలో ఎక్కువ ఆసక్తి చూపించే వారు కాదు.ఆయన పెద్దగా సంపాదన గురించిన ఇంట్రెస్ట్‌ కలిగి లేడు.

అందుకే ఆయన సినిమా ల పారితోషికాలు నామమాత్రంగానే ఉంటాయి.అలాగే ఆయన వ్యాపారాలు కూడా తక్కువగానే ఉంటాయి.

ఎమ్మెల్యే గా ఉన్నా కూడా అవినీతి కి పాల్పడడు అనే టాక్ ఉంది.

మీ తీరుని ప్రశ్నిస్తే బూతుల నానినా.?: పేర్ని నాని