బాలకృష్ణ రిజెక్ట్ చేసిన 6 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఏంటో తెలుసా ?
TeluguStop.com
నందమూరి బాలకృష్ణ.వయసుపెరుగుతున్న కొద్ది ఎనర్జీ కూడా పెంచుకుంటూ పోతున్న సీనియర్ హీరో.
దాదాపుగా 60 ఏళ్ల వయసు దగ్గర పడుతున్న కూడా యువ హీరోల్లో కూడా లేని ఉత్సాహం ఆయన సొంతం.
సినిమా సినిమాకు రెట్టించిన ఉత్సాహంతో 100 సినిమాలకు పైగా నటించి చాలామంది హీరోలకు సాధ్యం కానీ ఒక రికార్డును సృష్టించేశాడు.
అయితే బాలకృష్ణ కొన్నిసార్లు బ్లాక్ బాస్టర్ సినిమాలను సైతం రిజెక్ట్ చేశారని విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలన సృష్టిస్తోంది.
అలా బాలకృష్ణ వదిలేసిన ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.సింహాద్రి, స్టూడెంట్ నెంబర్ 1
రాజమౌళి దర్శకత్వం వచ్చిన ఈ రెండు సినిమాల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించాడు.
జూనియర్ ఎన్టీఆర్ కన్నా ముందు రాజమౌళి ఈ రెండు చిత్రాలని బాలకృష్ణతోనే తీయాలని భావించాడట.
ఏ కారణాల చేతనో తెలియదు కానీ ఈ రెండు చిత్రాలను బాలకృష్ణ రిజెక్ట్ చేశాడట.
దాంతో ఈ రెండు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలన్నీ బాలకృష్ణ వదులుకోవాల్సి వచ్చింది.
అన్నవరం; వకీల్ సాబ్
పవన్ కళ్యాణ్ నటించిన అన్నవరం, వకీల్ సాబ్.ఈ రెండు సినిమాలు కూడా రీమేక్ చిత్రాలు కావడం విశేషం.
అన్నవరం ఒక తమిళ సినిమాకు రీమేక్ కాగా, వకీల్ సాబ్ బాలీవుడ్ మూవీ పింకి సినిమాకి రీమేక్ గా రిలీజ్ అయింది.
ఇక ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి.అయితే ఈ రెండు చిత్రాల్లో తొలుత బాలకృష్ణ హీరోగా నటించాల్సి ఉండగా రీమేక్ సినిమాల్లో నటించడానికి ఆయన ఒప్పుకోకపోవడంతో ఈ చిత్రాలు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లాయి.
"""/"/
సూర్యవంశం; నాగవల్లి
వెంకటేష్ హీరోగా నటించిన సూర్యవంశం, నాగవల్లి చిత్రాలు సైతం తొలుత బాలకృష్ణ చేయాల్సి ఉంది.
ఈ రెండు సినిమాల్లో సూర్యవంశం వెంకటేష్ ద్విపాత్రాభినయం చేయగా ఘనవిజయం సాధించింది.ఇక నాగవల్లి సినిమా సైతం అలాగే డ్యూయల్ రోల్ లో రాగా ఈ సినిమా మాత్రం పరాజయం పాలైంది.
డేట్స్ అడ్జస్ట్ చేయడంలో ప్రాబ్లమ్స్ ఎదురవడంతో ఈ రెండు చిత్రాలను బాలకృష్ణ వదులుకోవాల్సి వచ్చింది.
సింహరాశి """/"/
రాజా శేఖర్ హీరోగా నటించిన సాధించిన సినిమా సింహరాశి.ఈ చిత్రంలో సైతం తొలుత బాలకృష్ణ నటించాల్సి ఉండగా ఏవో కారణాలవల్ల ఆయన ఈ చిత్రానికి నో చెప్పారు.
దాంతో ఈ సినిమా దర్శకుడైన భీమినేని శ్రీనివాసరావు ఈ చిత్ర కథ రాజశేఖర్ కి వినిపించడంతో ఆయన ఓకే చేశాడు.
నన్ను దేవుడు అందంగా పుట్టించాడు…ఆ అవసరం రాలేదు… రకుల్ కామెంట్స్ వైరల్!