జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
TeluguStop.com
నందమూరి తారక రామారావు.( Nandamuri Taraka Ramarao ) ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ఈ పేరు వినగానే తెలియని వైబ్రేషన్స్ రెస్పెక్ట్ వస్తుంది.ఒకప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి మంచి గుర్తింపును ఏర్పరుచుకున్నారు నందమూరి తారక రామారావు.
ఇకపోతే నందమూరి తారక రామారావు పేరును షార్ట్కట్లో ఎన్టీఆర్ అనే పేరుతో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) పేరు పెట్టుకున్న విషయం తెలిసిందే.
ఒక లెజెండరీ నేమ్ లేదా ట్యాగ్ తగిలించుకోవడం చాలా ఈజీ.కానీ దాన్ని నిలబెట్టుకోవడం కష్టం.
ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు ఒక ప్రభంజనం కాగా ఆ పేరు పెట్టుకున్న తారక్ తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నారు.
"""/" /
అసలు తారక్ స్టార్ గా ఎదగడానికి ఎన్టీఆర్ అనే పేరులో ఉన్న ఆ పవర్ కూడా కారణం అని నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు.
అలాగే బాలయ్యతో( Balayya ) పాటు నందమూరి వర్గంలో కొందరికి తారక్ తాత పేరు పెట్టుకోవడం ఇష్టం లేదనే వాదన కూడా ఎప్పటి నుంచో ఉంది.
కర్ణాటకకు చెందిన షాలిని( Shalini ) అనే మహిళను హరికృష్ణ( Hari Krishna ) రెండో వివాహం చేసుకున్నాడు.
ఆమె కుమారుడే జూనియర్ ఎన్టీఆర్.తారక్ ని తమ వారసుడిగా భావించని నందమూరి ఫ్యామిలీ అతడి ఎదుగుదల చూసి ఓర్చుకోలేకపోయిందని, తారక్ కి అడ్డుకట్ట వేయడం కోసం తారకరత్నను దింపారనే కూడా నడిచాయి.
ఈ విషయంపై తారకరత్న గతంలో ఒక ఇంటర్వ్యూలో స్పందించడం విశేషం. """/" /
అయితే తాత ఎన్టీఆర్ పేరును తారక్ పెట్టుకోవడం బాలయ్యకు కూడా నచ్చలేదట.
అసలు తారక్ కి ఎన్టీఆర్ అనే పేరు ఎలా వచ్చింది? ఎవరు పెట్టారని చెప్పుకొచ్చారు హరికృష్ణ.
ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న హరికృష్ణ మాట్లాడుతూ.
నా ఇద్దరు పెద్ద కొడుకులకు జానకి రామ్, కళ్యాణ్ రామ్ అని పేర్లు పెట్టాడు.
మూడో వాడికి కూడా రామ్ అని కలిసి వచ్చేలా తారక్ రామ్ అని పెట్టాను.
ఒక రోజు నాన్నగారు మూడో వాడు ఏం చేస్తున్నాడు ? అని అడిగారు.
ఏం చేస్తాడండీ.చదువుకుంటున్నాడు అని నేను సమాధానం చెప్పాను.
ఒకరోజు నా దగ్గరకు తీసుకురా అన్నారు.నేను తీసుకెళ్ళాను.
ఏం పేరు అని తారక్ ని నాన్నగారు అడిగారు.తారక్ రామ్ అని సమాధానం చెప్పాడు.
లేదు హరికృష్ణ వీడు నా అంశతో పుట్టినవాడు.నందమూరి తారకరామారావు అని పేరు పెట్టు అన్నాడు.
ఎన్టీఆర్ అనే పేరు నాన్నగారు తారక్ కి స్వయంగా దానం చేశాడు అని తెలిపారు.
పరోక్షంగా బాలయ్యతో పాటు నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్ ని వ్యతిరేకిస్తున్న వారికి హరికృష్ణ కౌంటర్ ఇచ్చాడు.
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దంతాలపై పసుపు మరకలను పోగొట్టే బెస్ట్ హోమ్ రెమెడీస్ మీకోసం!