వైరల్ అవుతున్న బాలయ్య లుక్.. ఎంత బాగున్నాడో!

నందమూరి వారసుడిగా బాలకృష్ణ తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో విభిన్న పాత్రలలో, పౌరాణిక సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు.

ప్రస్తుతం బాలకృష్ణ ప్రముఖ మాస్ అండ్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శీను దర్శకత్వంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇప్పటికే బోయపాటి శీను దర్శకత్వంలో నటించిన "సింహ", "లెజెండ్"సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.

అయితే వీరిద్దరి కాంబినేషన్ లో ప్రస్తుతం మూడవ సినిమా`బిబి3` వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాపై అటు బాలకృష్ణతో పాటు ఇటు నందమూరి అభిమానులు సైతం భారీ అంచనాలు పెట్టుకున్నారు.

బాలకృష్ణ తాజాగా నటిస్తున్న 106వ చిత్రం కావడం విశేషం.ఈ సినిమాలో బాలకృష్ణ పక్కన హీరోయిన్లుగా ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటిస్తున్నారు.

అయితే ఈ సినిమా షూటింగ్ లో భాగంగా తాజా షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరుగుతుంది.

ఈ విధంగా సెట్ పై ఉన్న బాలకృష్ణను కలవడానికి కొంతమంది తెలంగాణ యువత తెలుగు ప్రతినిధులు షూటింగ్ లొకేషన్ కి వచ్చి బాలకృష్ణను కలిశారు.

ఈనెల 24వ తేదీన జరగబోయే తెలంగాణ తెలుగు యువత ప్రమాణస్వీకారోత్సవానికి ఆయనను ఆహ్వానించారు.

"""/"/ ప్రమాణ స్వీకారోత్సవానికి బాలకృష్ణ ఆహ్వానించడమే కాకుండా, బాలయ్య చేతుల మీదుగా తెలంగాణ తెలుగు యువత లోగోను కూడా ఆవిష్కరించారు.

అయితే ఈ క్రమంలో బాలకృష్ణ ఓ కొత్త లుక్ లో కనిపించారు.ఇందులో బాలకృష్ణ లుక్ తన అభిమానులను, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

బాలకృష్ణ కొత్త లుక్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బాలకృష్ణ ఫోటోలను చూసిన అభిమానులు బాలయ్య న్యూ లుక్ సూపర్ అంటూ, కామెంట్లు పెడుతున్నారు.

బాలయ్య ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

అయ్యబాబోయ్.. రైలు టికెట్‌పై ఇన్ని వసతులు ఉచితంగా ఉంటాయని మీకు తెలుసా..?