తమిళ్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్న బాలయ్య..?
TeluguStop.com
తమిల్ సినిమా ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన డైరెక్టర్ పా రంజిత్( Director Pa Ranjith ) ఆయన రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ తో కూడా కబాలి ( Kabali ) లాంటి సినిమా తీసి మంచి సక్సెస్ అందుకున్నాడు.
అయితే కొద్దిరోజుల నుంచి రంజిత్ డైరెక్షన్ లో బాలకృష్ణ ( Balakrishna ) నటించబోతున్నాడు అంటూ చాలా వార్తలు వస్తున్నాయి.
అయితే రంజిత్ ఇప్పటికే బాలయ్య ని కలిసి ఒక మంచి కథ చెప్పాడట అది బాలయ్యకి కూడా బాగా నచ్చిందట.
"""/" /
ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు ఆ సినిమా పూర్తి అయ్యాక బోయపాటి తో ఒక సినిమా కమిట్ అయ్యాడు ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాక పా రంజిత్ తో సినిమా ఉంటుంది అని తెలుస్తుంది.
ఈ సినిమా కంప్లీట్ గా ఊర మాస్ సినిమా గా ఉంటుందని తెలుస్తుంది.
ఇప్పటికే రంజిత్ రజినీకాంత్ గారిని కాల సినిమా లో ఊర మాస్ గా చూపించారు ఇక అదే టైప్ లో బాలయ్యని కూడా మాస్ యాంగిల్ లో చూపిస్తాడట.
ఇప్పటికే బాలయ్య ని చాలా మంది డైరెక్టర్లు మాస్ లోనే చాలా వెరిషన్స్ చూపించారు పా రంజిత్ మాత్రం వాళ్లందరి కంటే బిన్నం గా చూపిస్తాడట.
"""/" /
అయితే ఇది ఇలా ఉంటే బాలయ్య ఫ్యాన్స్ మాత్రం తెలుగులోనే చాలా మంది మాస్ డైరెక్టర్లు ఉన్నారు కదా వాళ్ళతో చేయచ్చు కదా ఎందుకు బాలయ్య బాబు ఆయన తో సినిమా చేస్తున్నాడు రజినీకాంత్ తో చేసిన రెండు సినిమాలు అంత పెద్దగా ఆడలేదు అని అంటున్నారు.
నిజానికి ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ఇంకో సంవత్సరం పడుతుంది అప్పటి వరకు రంజిత్ బాలయ్య కోసం వెయిట్ చేస్తాడా లేదా అనేది వేచి చూడాలి.