మళ్లీనా : ఆ గడ్డం చూడలేక చస్తున్నాం

బాలకృష్ణ 106వ సినిమా నేడు లాంచనంగా ప్రారంభం అయ్యింది.మొదటి నుండి చెబుతున్నట్లుగానే ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించబోతున్నాడు.

వినయ విధేయ రామ చిత్రం ఫ్లాప్‌ తో ఈ దర్శకుడిపై అందరు హీరోలు అపనమ్మకం పెట్టుకున్నారు.

కాని బాలయ్య మాత్రం సింహా మరియు లెజెండ్‌ సినిమాల ఫలితాల కారణంగా చాలా నమ్మకంతో ఈ సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు.

తన 105వ సినిమా రూలర్‌లో వింతైన గడ్డంతో బాలయ్య నటిస్తున్న విషయం తెల్సిందే.

ఆ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.మరో రెండు వారాల్లో సినిమా విడుదల కాబోతున్నా కూడా ఇప్పటి వరకు ఆ సినిమాను పట్టించుకునే నాధుడే లేడు.

కారణం అందులో బాలయ్య లుక్‌ కూడా అయ్యి ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అలాంటి చెత్త లుక్‌ అంటూ కామెంట్స్‌ వస్తున్నా కూడా మళ్లీ అదే లుక్‌ తో తన 106వ సినిమాలో కూడా ఈయన కనిపించబోతున్నాడా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎందుకంటే షూటింగ్‌ ప్రారంభోత్సవం రోజున అంటే నేడు అదే లుక్‌తో ఇందులో పాల్గొనడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.

ఆ సినిమాలోనే చూడటం కష్టంగా ఉంది.మళ్లీ నిన్ను అలా చూడాలా అంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బోయపాటికి లుక్‌ మార్చమంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.

సలార్ 2 లో కీలక పాత్ర లో నటించనున్న స్టార్ హీరో…