ఏఎన్నార్ అవార్డు వేడుకలకు బాలయ్య మిస్సింగ్.. బాలయ్య మిస్ కావడానికి కారణాలివేనా?

టాలీవుడ్ సీనియర్ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లు ఒకేసారి ఒకే వేదికపై కనిపించడం అన్నది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.

ఈ నలుగురు కనిపించిన సందర్భాలు కూడా చాలా తక్కువ అని చెప్పాలి.ఒకవేళ కలిస్తే మాత్రం నలుగురు హీరోల అభిమానులకు పండగే అని చెప్పాలి.

అలాగే ఈ హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూడడానికి అభిమానులు కూడా ముచ్చట పడుతుంటారు.

కానీ బాలయ్యకు చిరు, నాగార్జున( Nagarjuna ) లకు అంతగా సఖ్యత ఉండదు అనే నానుడి ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉంటుంది.

"""/" / నాగార్జున ఉంటే బాలయ్య ఉండరు, బాలకృష్ణ ఉన్న చోట నాగ్ ఉండరు అంటారు.

కానీ వెంకటేష్( Venkatesh ) మాత్రం మిగతా హీరోలతో తత్సంబందాలు మైంటైన్ చేస్తారు.

బాలయ్య 50 ఇయర్స్ ఇండస్ట్రీ వేడుకలకు నాగ్ దూరంగా ఉండగా ఇప్పుడు ANR అవార్డు వేడుకల్లో బాలయ్య మిస్ అయ్యారు.

అలాగే బాలయ్య ఈవెంట్ లో మెగాస్టార్ చిరు, వెంకటేష్ సందడి చెయ్యగా, అక్కడ నాగార్జున కనిపించలేదు.

ఇప్పుడు ANR అవార్డు వేడుకల్లో మెగాస్టార్ చిరు, వెంకీ, నాగ్ లు కనిపించినా బాలయ్య కానరాలేదు.

దానితో ప్రతిసారి బాలయ్య ఎందుకు మిస్ అవుతున్నారు అని మాట్లాడుకుంటున్నారు. """/" / బాలయ్య( Balakrishna ) తన వేడుకకు నాగ్ కు ఆహ్వానం ఇవ్వలేదా, ఇచ్చినా నాగ్ రాలేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇప్పుడు నాగార్జున బాలయ్య ANR అవార్డు వేడుకకు పిలవలేదా, పిలిచినా బాలయ్య రాలేదా అనేది సస్పెన్స్ గానే కనిపిస్తోంది.

లేదంటే బాలయ్య బాబు రాకపోవడానికి ఇంకా ఏవైనా ఇతర కారణాలు ఉన్నాయా అన్న విషయం గురించి కూడా ఆలోచిస్తున్నారు అభిమానులు.

ఏది ఏమైనప్పటికీ మిగతా ముగ్గురు హీరోలు కనిపించి బాలయ్య బాబు కనిపించకపోవడంతో అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అక్కడ పుష్ప ది రూల్ మూవీ టికెట్ రేటు ఏకంగా రూ.3000.. అసలేం జరిగిందంటే?