చిరు ఎఫెక్ట్ తో కాస్త ఆలస్యంగా బాలయ్య రీ ఎంట్రీ
TeluguStop.com
చిరంజీవికి కరోనా పాజిటివ్ అంటూ తేలడంతో చాలా మంది ఆందోళన వ్యక్తం చెందుతున్నారు.
ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటున్నా కూడా ఎక్కడో ఒక్కచోట చిన్న తప్పు జరిగి కరోనా బారిన పడాల్సి వస్తుంది అంటూ చిరంజీవి ఉదంతంతో వెళ్లడి అయ్యింది.
చిరంజీవికి కరోనా సోకినా ఆరోగ్యంగానే ఉన్నారు.అయితే అందరు అలా ఉంటారని లేదు.
అందుకే ప్రతి ఒక్కరు కరోనాతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ వైధ్యులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా అయిదు పదుల వయసు దాటిన వారు పూర్తిగా ఇంటికే పరిమితం అవ్వడం అన్ని విధాలుగా మంచిది అనే అభిప్రాయం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో షూటింగ్ లో జాయిన్ అవ్వాలనుకున్న వారు కూడా మళ్లీ వెనక్కు తగ్గుతున్నట్లుగా సమాచారం అందుతోంది.
ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఆ విషయంను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించి షూటింగ్ ను పునః ప్రారంభించాలని భావించారు.
కాని అనూహ్యంగా చిరంజీవి ఇష్యూతో మొత్తం మ్యాటర్ మొదటికి వచ్చింది.బోయపాటి, బాలయ్యల మూవీ కాస్త ఆలస్యంగా ప్రారంభించాలనే ఉద్దేశ్యంతో ఉన్నారట.
కేవలం బాలకృష్ణ మాత్రమే కాకుండా చిరంజీవి విషయం బయటకు వచ్చిన తర్వాత స్టార్స్ అంతా కూడా ఒక్క సారిగా ఆలోచనల్లో పడ్డారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
కరోనా నుండి ఇంకొన్నాళ్లు దూరంగా ఉంటే వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఒకేసారి రెండు సినిమాలు కూడా చేసుకోవచ్చు.
ఇప్పుడు అనవసరంగా ఆందోళనలో పడటం ఎందుకు అన్నట్లుగా కొందరు ఫిల్మ్ మేకర్స్ కూడా భావిస్తున్నారట.
చిరంజీవి అరోగ్య విషయం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవ్వడంతో చాలా మంది ఆయన చేసిన తప్పులను చూసి వాటిని పునరావృతం కాకుండా జాగ్రత్తలు పడుతున్నారు.
చిరంజీవి ఆమద్య ఒక పెళ్లికి హాజరు అయ్యారు.ఆ తర్వాత సీఎంను కలిశారు.
ఎక్కడ వైరస్ అంటి ఉంటుందనే విషయంలో క్లారిటీ లేదు.
కాలేజీ కూడా కంప్లీట్ చేయని మహిళ ప్రతినెలా రూ.15 లక్షలు సంపాదిస్తోంది.. ఎలాగంటే..?