'లెజెండ్' బాలయ్య ఆ ముస్లిం హీరోయిన్ ను పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా?

నందమూరి వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ.ఎంట్రీ ఈజీగానే దొరికినా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి మాత్రం ఆయన స్వయం కృషి , ప్రతిభనే కారణం అని చెప్పాలి.

నందమూరి సింహంగా గుర్తింపు పొందిన ఈ సీనియర్ హీరో పైకి గంభీరంగా కనిపిస్తారు.

కానీ మనసు వెన్నపూస.ఆయన ఆలోచనలు చాలా సున్నితంగా ఉంటాయి అని బాలయ్య సన్నిహితులు చెబుతూ ఉంటారు.

ఆయన స్నేహమైనా, ప్రేమ అయినా మనస్పూర్తిగా స్వచ్ఛంగా అందిస్తారు బాలయ్య.బాలయ్య స్నేహం, ప్రేమ అనంతం.

అలాంటి బాలకృష్ణ నమ్మితే ప్రాణం ఇస్తారు.అందరి జీవితం లోనూ ఏదో ఒక ప్రేమ కథ ఉండనే ఉంటుంది.

అలాగే బాలకృష్ణ జీవితం లోనూ ఒక ప్రేమ కథ ఉందట.బాలయ్య ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించారు.

ఆమెతోనే తన జీవితం పంచుకోవాలని కోరుకున్నారట.అయితే ఇద్దరు వ్యక్తుల కారణంగా తన ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకువెళ్ళలేకపోయారని, తాను ప్రేమించిన అమ్మాయిని వదులుకున్నారు అని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఓ ఇంటర్వ్యూలో చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అలాగే వర్మ ‘నగ్నం’ హీరోయిన్ శ్రీరాపాక కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు.ఇంతకీ బాలకృష్ణ వంటి గొప్ప వ్యక్తి ప్రేమను పొంది పెళ్లి చేసుకోలేకపోయిన ఆ దురదృష్టవంతురాలు ఎవరు.

?? ఆమె కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తేనా అన్న వివరాలు ఇపుడు చూద్దాం.

అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆమె కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే.ఆమె ఇక స్టార్ హీరోయిన్ , ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలలో నటించారు.

అయితే తాను ప్రేమించిన ఆ హీరోయిన్ గురించి తన కాస్ట్యూమ్స్ డిజైనర్ తో చెప్పారట బాలయ్య.

అప్పట్లో బాలయ్య దగ్గర కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసిన వర్మ నగ్నం హీరోయిన్ శ్రీరాపాక.

డిజైనర్ గా బాలయ్యతో పరిచయం పెరిగి వారి మధ్య సన్నిహితం ఎక్కువయ్యిందట.కాగా ఇద్దరు ఒకరికొకరు అన్ని విషయాలను చెప్పుకొనేవారట.

అలా ఒక సందర్భం లో అప్పట్లో తాను యుక్త వయసులో ఉన్నప్పుడు తాను ప్రేమించిన అమ్మాయి గురించి కూడా ఆమెతో చెప్పారట.

ఇంతకీ బాలయ్య ప్రేమించింది ఎవరినో కాదు సీనియర్ స్టార్ హీరోయిన్ కుష్బూ.ఆమెని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించారట బాలయ్య , తనతో ఏడడుగులు నడవాలని కోరుకున్నారట.

"""/"/ అయితే ఆ విషయం కాస్త తండ్రి నందమూరి రామారావు మరియు అన్నయ్య హరికృష్ణ కు తెలియడం తో విషయం రివర్స్ అయ్యిందట.

వారు బాలయ్య ను పిలిచి మరి ఏమిటి ఈ ప్రేమలు, దోమలు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఇక్కడితో అంతా ఆపేయాలని గట్టిగా చెప్పడంతో తన ప్రేమను వదులుకున్నారట బాలయ్య.

తండ్రి మాటను జవదాటని బాలకృష్ణ ఆయన్ను బాధపెట్టడం ఇష్టం లేక తాను ప్రేమించిన కుష్బూను త్యాగం చేశారట.

అప్పట్లో ఆయన చాలాకాలం మనోవేదనకు గురై కొన్నాళ్ళు సినిమాలకు కూడా దూరం అయ్యారట బాలయ్య.

అయితే బాలకృష్ణ తన కెరియర్ కి కుష్బూ తో ఒక్క సినిమా కూడా చేయలేదు.

అయితే ఇండస్ట్రీ లోని ప్రముఖ వ్యక్తులు కాబట్టి ఏదో ఒక సందర్భం లో తరచూ కలుస్తుండేవారు.

అలా వారి మద్య మాటలు పెరిగి, మనసులు కలిశాయి అని అంటుంటారు.అయితే బాలకృష్ణ , హీరోయిన్ విజయ శాంతి ల మద్య కూడా డీప్ లవ్ వార్ నడిచింది అన్న వార్తలు కూడా చాలానే విన్నాం కానీ అందులో ఎంత నిజముందో అన్న విషయం క్లారిటీ లేదు.

సాంకేతిక లోపంతో ఎక్కడికక్కడ ఆగిపోయిన హైదరాబాద్ మెట్రో రైళ్లు..