నోరుజారి శ్రీ లీల సీక్రెట్ బయట పెట్టేసిన బాలయ్య… ఏమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో యంగ్ బ్యూటీ శ్రీ లీల (Sreeleela) ఒకరు.

ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను అందుకుని షూటింగ్ పనులలో బిజీ అయ్యారు.

ఇక ఈమె బాలకృష్ణ ( Balakrishna ) హీరోగా అనిల్ రావిపూడి ( Anil Ravipudi ) దర్శకత్వంలో వస్తున్న భగవంత్ కేసరి ( Bhagavanth Kesari) అనే సినిమాలో కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. """/" / ఇకపోతే బాలకృష్ణ హీరోగా మాత్రమే కాకుండా బసవతారకం హాస్పిటల్ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే.

దీంతో బసవతారకం హాస్పిటల్ 23వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు.

ఇక ఈ కార్యక్రమానికి పీవీ సింధు( PV Sindhu ) , శ్రీ లీల కూడా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ నటి శ్రీలీల గురించి మాట్లాడుతూ పొరపాటున నోరు జారారు.

ప్రస్తుతం ఈమె భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈ సినిమాలో శ్రీ లీల పాత్ర ( Sreeleela Role ) గురించి బాలయ్య లీక్ చేసేసారు.

"""/" / ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.మా శ్రీలీల ఉంది.

ఉదయాన్నే మా సినిమా భగవంత్ కేసరిలో ఫైట్స్ చేసి ఇక్కడికి వచ్చిందని పొరపాటున బాలయ్య చెప్పడం విశేషం.

వెంటనే తేరుకుని రేపు మీరు చూస్తారుగా సినిమాలో అంటూ నోటికి తాళం వేసుకున్నారు.

 ఎంతో అందంగా తన క్యూట్ లుక్స్ తో అందరిని ఆకట్టుకుని శ్రీ లీల చేత అనిల్ రావిపూడి యాక్షన్ సన్నివేశాలను కూడా చేయిస్తున్నారు అని బాలయ్య ఈ సందర్భంగా లీక్ చేసేసారు.

ఇక క్యాన్సర్ ఆస్పత్రిలో ఈ కార్యక్రమం జరగడంతో శ్రీ లీల తాను కూడా డాక్టర్ అనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

కాలేజీ చదువుతున్న సమయంలో క్యాన్సర్ విభాగం అంటే తన స్నేహితులు చాలా భయపడేవారని తెలిపారు.

అయితే ఇక్కడ ఇంతమంది డాక్టర్లు క్యాన్సర్ బారిన పడిన వారికి వైద్యం అందిస్తున్నారు అంటే నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి అంటూ శ్రీ లీల ఈ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.