బాలయ్య గోడ దూకాడట.. ఎందుకో తెలుసా..?

నందమూరి బాలకృష్ణ గోడ దూకాడట.బాలయ్య ఏంటి గోడ దూకడం ఏంటని అనుకోవచ్చు.

ఇప్పుడు స్టార్స్ గా ఉన్న అందరు యంగ్ ఏజ్ లో ఏదో ఒక చిలిపి పనులు చేసి ఉంటారు.

స్టార్స్ విషయాలు వారు చెబితేనే కాని అందరికి తెలియదు.ఈ క్రమంలో లేటెస్ట్ గా అన్ స్టాపబుల్ షోలో బాలయ్య బాబు తను గోడ దూకిన విషయాన్ని చెప్పారు.

అన్ స్టాపబుల్ ఫైనల్ ఎపిసోడ్ కి సూపర్ స్టార్ మహేష్ గెస్ట్ గా రాగా ఆయన తన కె.

బి.ఆర్ పార్క్ జాగింగ్ అనుభవాన్ని చెప్పుకొచ్చారు.

పార్క్ చుట్టూ ఒక రౌండ్ వేసే సరికి పొదల్లో ఒక పాము పడగ విప్పి కనిపించిందని.

మళ్లీ రిటర్న్ 5 కిలోమీటర్లు జాగింగ్ చేసి ఇంటికి వచ్చానని.అప్పటి నుండి ఇప్పటివరకు కె.

బి.ఆర్ పార్క్ వంక చూడలేదని అన్నారు.

అయితే ఈ క్రమంలో బాలయ్య మాత్రం తాను కె.బి.

ఆర్ పార్క్ గేటు కూడా ఓపెన్ చేయకపోతే గోడ దూకి మరి పార్క్ లో జాగింగ్ చేశానని అన్నారు.

ఆ వాచ్ మెన్ తనని గుర్తుపట్టకపోతే నేనయ్యా బాలకృష్ణని అని చెప్పి మరి నువ్వు ఉదయం నాలుగున్నర గంటలకు గేటు తీయి లేదంటే నేను గోడ దూకి రావాల్సి వస్తుందని అన్నారని షోలో చెప్పారు.

మొత్తానికి మహేష్ తో ఎపిసోడ్ అద్భుతంగా సాగిందని చెప్పొచ్చు.బాలకృష్ణ లోని మరో యాంగిల్ ఈ షో ద్వారా బయటకు వచ్చిందని మాత్రం ఖచ్చితంగా అర్ధమవుతుంది.

రెగ్యులర్ గా ఈ డ్రింక్ ను తీసుకుంటే నెల రోజుల్లో పొట్ట కొవ్వు కరిగిపోతుంది!