నిన్న మొన్నటి వరకు తిట్టి.. ఇప్పుడు బాలయ్య ఫంక్షన్‌కు రమ్మంటే కేసీఆర్‌ వస్తాడా?

బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా భావిస్తూ నిర్మిస్తూ నటిస్తున్న తన తండ్రి ఎన్టీఆర్‌ బయోపిక్‌ మూవీ విడుదలకు సిద్దం అయ్యింది.

సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం షూటింగ్‌ దాదాపుగా పూర్తి కావచ్చిందని సమాచారం అందుతోంది.

ఇక ఈ చిత్రంకు ప్రమోషన్‌ కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.ఎన్టీఆర్‌ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ను ఈనెల 16న ఏర్పాటు చేశారు.

అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి.హైదరాబాద్‌లో జరుగబోతున్న ఈ కార్యక్రమానికి కేసీఆర్‌ను ఆహ్వానించాని బాలయ్య ప్రయత్నాలు చేస్తున్నాడు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ట్రైలర్‌ను కేసీఆర్‌ చేతుల మీదుగా విడుదల చేస్తే తెలంగాణలో సినిమాపై పాజిటివ్‌ వేవ్‌ ఉంటుందని బాలయ్య భావిస్తున్నాడు.

అందుకే కేసీఆర్‌ను కలిసేందుకు అపాయింట్‌మెట్‌ కోరినట్లుగా తెలుస్తోంది.అయితే బాలయ్య ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్‌ మరియు టీఆర్‌ఎస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెల్సిందే.

ఆ విమర్శలు చేసి నెల కూడా కాకుండానే అప్పుడే కేసీఆర్‌ను కలిసి నా ఫంక్షన్‌కు రమ్మంటే వస్తాడా అంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ తెలుగు దేశం పార్టీపై కేసీఆర్‌కు ప్రస్తుతం పీకల్లోతు కోపం ఉంది.

ఆ కోపం బాలయ్యపై కూడా ప్రదర్శించే అవకాశం ఉందని, అందుకే బాలయ్య అటువైపుగా వెళ్లకుంటేనే మంచిది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

మరో వైపు కేసీఆర్‌ కొత్త ప్రభుత్వం ఏర్పాటు విషయంలో చాలా అంటే చాలా చాలా బిజీగా ఉన్నాడు.

ఇలాంటి సమయంలో బాలయ్య మూవీ వేడుకకు ఆయన వచ్చే అవకాశమే లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్‌ తనకు రాజకీయ గురువు అంటూ కేసీఆర్‌ గతంలో ఎన్నో సార్లు చెప్పాడు.

తన కొడుకు రామారావు అనే పేరు ఆయనపై అభిమానంతోనే పెట్టాడు.అందుకే వేడుకకు కేసీఆర్‌ హాజరు అయ్యే అవకాశం లేక పోలేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.