సోషల్ మీడియా వేదికగా మహేష్ పై ప్రశంసలు కురిపించిన బాలయ్య!
TeluguStop.com
సూపర్ స్టార్ మహేష్ బాబు పై నందమూరి నటసింహం బాలకృష్ణ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు.
మహేష్ బాబును ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
రీసెంట్ గా మహేష్ బాబు బాలకృష ఆహా ఓటిటి లో చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే షోలో పాల్గొన్న విషయం తెలిసిందే.
ఈ ఎపిసోడ్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది.ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ మహేష్ బాబు పై ప్రశంసలు కురిపించారు.
ఈ ఎపిసోడ్ తో సీజన్ వన్ ను విజయవంతంగా పూర్తి చేయబోతున్నారు.ఫైనల్ ఎపిసోడ్ కావడం అందులోను బాలయ్య, మహేష్ బాబు ఒకే వేదికపై కనిపించబోతుండడంతో ఈ ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
మహేష్, బాలకృష్ణ ల ఫైనల్ ఎపిసోడ్ ఫిబ్రవరి 4న స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ అనౌన్స్ చేసారు.
ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమో కూడా రిలీజ్ చేసారు. """/"/ ఈ ప్రోమో ద్వారా బాలయ్య, మహేష్ బాబు మధ్య చాలా ఆసక్తికర సంభాషణ జరిగినట్టు చూపించారు.
ఈ ఎపిసోడ్ లో మహేష్ బాబు తో బాలయ్య సందడి మాములుగా లేదు.
చాలా జోవియల్ గా వీరిద్దరి సంభాషణ సాగింది.ఈ ఎపిసోడ్ కోసం సూపర్ స్టార్ అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
"""/"/
ఇక ఈ క్రమంలోనే తాజాగా బాలయ్య ఈ ఎపిసోడ్ గురించి సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేసారు.
''అద్భుతమైన నటుడు.అంతకన్నా అద్భుతమైన మనసు మన సూపర్ స్టార్ మహేష్ బాబు ది'' అని బాలయ్య మహేష్ ను కొనియాడారు.
ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.ఇక వీళ్ళ సినిమాల విషయానికి వస్తే.
మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తుండగా.బాలయ్య గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తన 107 వ సినిమాను చేస్తున్నాడు.
హరిహర వీరమల్లు పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ సాదించబోతుందా..?