బాలయ్య కొత్త సినిమా టైటిల్ ఇదేనా.. రెడ్డి సెంటిమెంట్ తో?

బాలయ్య కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో సమరసింహారెడ్డి సినిమా కూడా ఒకటి.

బి.గోపాల్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కి 1999 సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైంది.

బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రికార్డులను క్రియేట్ చేసింది.బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.

అయితే ఈ సినిమాకు కూడా బాలయ్య రెడ్డి సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారని సమాచారం అందుతోంది.

బాలయ్య గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో వీరసింహారెడ్డి అనే పాత్రలో నటిస్తున్నారని పాత్ర పేరే టైటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

గతంలో ఈ సినిమాకు వేటపాలెం, రౌడీయిజం అనే టైటిల్స్ వినిపించగా మేకర్స్ టైటిల్ గురించి వైరల్ అయిన వార్తలను ఖండించారు.

ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ కూడా జోరుగా ప్రచారంలోకి వచ్చింది.

అయితే ఈ టైటిల్స్ కాకుండా మరో పవర్ ఫుల్ టైటిల్ ప్రచారంలోకి రావడంతో బాలయ్య బాబు అభిమానులు సంతోషిస్తున్నారు.

"""/" / అయితే మేకర్స్ ఈ టైటిల్ ను అయినా ఫిక్స్ చేస్తారో లేక మరో కొత్త టైటిల్ ను ఫిక్స్ చేస్తారో చూడాల్సి ఉంది.

బాలయ్య నటించిన సినిమాలలో సీమ సింహం మినహా సింహా సెంటి మెంట్ తో తెరకెక్కిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.

"""/" / ఆ సెంటిమెంట్ ప్రకారం కూడా ఈ సినిమా హిట్ అని ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు.

అయితే మరోవైపు షూటింగ్ మొదలైన రోజే బాలయ్య లుక్ కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో లీకైంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండగా లుక్కైన లీక్ వల్ల బాలయ్య అభిమానులు ఈ సంస్థను తెగ ట్రోల్ చేస్తున్నారు.

పంజాబ్‌లో వ్యాపారి హత్య.. అమెరికాలోని ఎన్ఆర్ఐ ప్రమేయం, పాతకక్షలతో దారుణంగా