బాలయ్య 107 మూవీ టైటిల్ లీక్.. మరోసారి రెడ్డి సెంటిమెంట్ తో?

ఈ మధ్య కాలంలో బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీ టైటిల్ కు సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

రేపు రాత్రి ఈ సినిమా టైటిల్ కు సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నారు.

అయితే ఈ సినిమా టైటిల్ లీకైంది.ఈ సినిమాకు వీరసింహారెడ్డి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని బోగట్టా.

బాలయ్య గతంలో సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి టైటిల్స్ తో తెరకెక్కిన సినిమాలలో నటించి సక్సెస్ సాధించారు.

టైటిల్ తో పాటు ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించనున్నారని బోగట్టా.

ఈ సినిమాకు జై బాలయ్య, రెడ్డిగారు అనే టైటిల్స్ వినిపించగా చివరకు ఈ టైటిల్ ఫిక్స్ అయింది.

వీరసింహారెడ్డి టైటిల్ బాగుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.బాలయ్యకు జోడీగా ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

చిరంజీవి బాలయ్య మధ్య సంక్రాంతికి వార్ తప్పదని తెలుస్తోంది.బాలకృష్ణ సినిమా వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో ఈ సినిమాల రిలీజ్ డేట్లు మారే అవకాశం అయితే ఉంది.

ఈ ఏడాది కళ్యాణ్ రామ్ సినిమా ఒకటి రిలీజ్ కానుండగా డిసెంబర్ రెండో వారంలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

డిసెంబర్ ఫస్ట్ వీక్ లో నాని నిర్మించిన హిట్2 సినిమా విడుదల కానుంది.

ధనుష్ నటించిన సర్ సినిమా కూడా ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానుంది.

"""/"/ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో విడుదలైన సినిమాలతో పోల్చి చూస్తే సెకండాఫ్ లో విడుదలైన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

2022 డిసెంబర్, 2023 జనవరిలో మంచి సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానుండటం గమనార్హం.

నలుపుదనం పోయి చర్మం తెల్లగా మెరిసిపోవాలా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!