బాలయ్య గోపీచంద్ మూవీ నుంచి సీన్ లీక్.. ఆ సీన్ లో ఏం జరిగిందంటే?
TeluguStop.com
బాలయ్య గోపీచంద్ మలినేని కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్నూలు, పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే.
అయితే ఓపెన్ ప్లేస్ లలో షూటింగ్ జరుగుతుండటం, చిత్రయూనిట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా గుట్టుచప్పుడు కాకుండా సెల్ ఫోన్ నుంచి షూట్ చేసేవాళ్లను కంట్రోల్ చేయలేకపోవడంతో ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలు సోషల్ మీడియాలో లీక్ అవుతున్నాయి.
జై బాలయ్య జైజై బాలయ్య పాటకు సంబంధించిన క్లిప్స్ ఇప్పటికే నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.
తాజాగా లీకైన సన్నివేశంలో బాలయ్య పేద రైతు కుటుంబానికి కొత్త ట్రాక్టర్ ను బహుమతిగా ఇవ్వగా ఆ పేద రైతు, అతని భార్య బాలయ్య ఆశీర్వాదం తీసుకున్నారు.
అయితే సినిమా రిలీజ్ కు చాలా సమయం ఉండగా ఈ సినిమాకు సంబంధించిన క్లిప్స్ లీక్ అవుతుండటంతో బాలయ్య అభిమానులు ఫీలవుతున్నారు.
"""/"/
చిత్ర నిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు ఈ సినిమా రిలీజ్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.
బాలయ్యకు జోడీగా శృతి హాసన్ నటిస్తుండగా శృతి హాసన్ కూడా తాజాగా కర్నూలులో సందడి చేయడం గమనార్హం.
డిసెంబర్ లో ఈ సినిమా రిలీజయ్యే అవకాశం ఉందని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం.
"""/"/
అఖండ తర్వాత బాలయ్య నటించిన సినిమా కావడంతో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి.
బాలయ్య ఈ సినిమా కోసం ఏకంగా 12 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని ఈ రెమ్యునరేషన్ బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ అని సమాచారం అందుతోంది.
బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
బాలయ్య, శృతి కాంబినేషన్ లో ఈ సినిమానే తొలి సినిమా అనే సంగతి తెలిసిందే.
డియర్ ఉమ మూవీ రివ్యూ అండ్ రేటింగ్!