బాలయ్య గోపీచంద్ మూవీ ఇంటర్వెల్ సీన్ అలా ఉంటుందా.. గూస్ బంప్స్ వచ్చేలా?
TeluguStop.com
బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఒక సినిమ తెరకెక్కుతుండగా ఇంకా పేరు ఫిక్స్ కాని ఈ సినిమాకు జై బాలయ్య టైటిల్ తో పాటు మరికొన్ని టైటిల్స్ ప్రచారంలోకి వస్తున్నాయి.
అఖండ సక్సెస్ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ సినిమాను నిర్మిస్తుండటంతో ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తుండటం గమనార్హం.
ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు.బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీలో ఇంటర్వెల్ సీన్ ప్రేక్షకుల అంచనాలను మించి ఉండనుందని తెలుస్తోంది.
ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఈ సీన్ ను గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నారని సమాచారం.
డిసెంబర్ నెలలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.ఈ సినిమా ఇంటర్వెల్ సీన్ ను యాక్షన్ సీన్ గా తెరకెక్కించారని సమాచారం అందుతోంది.
ఇంటర్వెల్ సీక్వెన్స్ లోనే ఫ్లాష్ బ్యాక్ షాట్స్ కనిపిస్తాయని ఇంటర్వెల్ తర్వాత నుంచి ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుందని తెలుస్తోంది.
క్రాక్ మూవీతో కమర్షియల్ సక్సెస్ ను సొంతం చేసుకున్న గోపీచంద్ మలినేని బాలయ్య సినిమాతో కూడా సక్సెస్ సాధిస్తే దర్శకుడిగా తన రేంజ్ ను పెంచుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
గోపీచంద్ మలినేని మాత్రం ఈ సినిమా రిజల్ట్ విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
"""/"/
బాలయ్య 12 కోట్ల రూపాయల పారితోషికం తీసుకొని ఈ సినిమాలో నటిస్తుండటం గమనార్హం.
ఈ సినిమాతో బాలయ్య రేంజ్ మారడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బాలయ్య ప్రస్తుతం నిదానంగానే సినిమాలు చేస్తున్నారు.
ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు విడుదలయ్యేలా బాలయ్య కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.
బాలయ్య పలు రియాలిటీ షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
స్టార్ హీరో అక్కినేని నాగార్జున మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలివే.. ఏం జరిగిందంటే?