ఆహా ఓటీటీ పై బాలయ్య ఫ్యాన్స్ ఆగ్రహం.. ఈ గ్యాప్ లు ఏంటి భయ్యా?
TeluguStop.com
నందమూరి బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్ ఈ వారం కూడా కొత్త ఎపిసోడ్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
గత వారం వచ్చిన ఎపిసోడ్ తోనే ప్రేక్షకులు మళ్లీ సంతృప్తి చెందాల్సి వస్తుంది.
గత సీజన్ బ్యాక్ టు బ్యాక్ ఎపిసోడ్స్ వచ్చాయి.కానీ ఈ సీజన్ మాత్రం ఒక ఎపిసోడ్ కి ఒక వారం గ్యాప్ అన్నట్లుగా ఉంటుంది.
ఒక వారం తప్పించి మరో వారం ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యం లో నందమూరి బాలకృష్ణ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆహా టీం వారు ఏ మాత్రం శ్రద్ధ తో బాలకృష్ణ టాక్ షో ని నిర్వహించడం లేదని వారు అసంతృప్తి గా ఉన్నారు.
ఇలాంటి టాక్ షో లు వారం వారం వస్తూ ఉంటాయి, కానీ బాలకృష్ణ బిజీ షెడ్యూల్ వల్ల లేదంటే ఆహా వారి అలసత్వం వల్ల ఒక వారం తప్పించి మరో వారం వస్తుంది.
ఇక నుండి అయినా రెగ్యులర్ గా ఎపిసోడ్స్ వస్తాయని ఆశిద్దాం.ఎంతకు వచ్చే వారం కి సంబంధించిన గెస్ట్ లు ఎవరు అనే విషయమై ఆసక్తికర చర్చ జరుగుతుంది.
జయసుధ మరియు జయప్రద మరియు ఇంకా ప్రముఖ యంగ్ హీరోయిన్ వారం లో వచ్చే అవకాశం ఉందని అంతా భావించారు.
కానీ ఆ విషయం ఇప్పటి వరకు ఇలాంటి అధికారిక ప్రకటన రాలేదు. """/"/ ఇక బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే గోపీచంద్ మలినేని దర్శకత్వం లో రూపొందుతున్న వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
ఆ సినిమా విడుదల కాకముందే అనిల్ రావిపూడి దర్శకత్వం లో బాలకృష్ణ సినిమా రూపొంద బోతుంది.
ఆ సినిమా కు సంబంధించిన టైటిల్ రేపు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.
నేడు లేదా రేపు బాలయ్య 108 టైటిల్ విషయం లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్లు కొట్టబోతున్నారా..?