ఎన్టీఆర్ కి చుక్కలు చూపించిన బాలకృష్ణ
TeluguStop.com
తెలుగు టీవి షో స్టేజిపై ఎన్టీఆర్ ఆధిపత్యానికి చెక్ పడింది.దాదాపుగా 50 రోజులు నెం1 షో గా ఉంటూ వస్తున్న బిగ్ బాస్ కిందికి దిగింది.
నెం1 స్థానంలో పాతుకు పోయినట్లు కనిపించిన స్టార్ మా గద్దె దిగింది.నెం1 ఇప్పుడు రానా దగ్గుబాటి నిర్వహిస్తున్న నెం1 యారి అయితే, నెం1 ఛానెల్ జెమిని.
BARC విడుదల చేసిన ఫలితాల ప్రకారం జెమినిటివి టిఆర్పి పాయింట్లు 502988 కాగా, స్టార్ మా పాయింట్లు 463291.
ప్రసుతం టాప్ 5 తెలుగు చానెల్స్ ఇవి.1) జెమినీ టివి
2) స్టార్ మా
3) ఈటీవి
4) జీ తెలుగు
5) మా మూవీజ్
బిగ్ బాస్ షో టీఆర్పి గత రెండువారాలుగా ఆశించిన స్థాయిలో లేదు.
ఇంట్లో మెంబర్స్ తగ్గిపోయిన తరువాత ప్రేక్షకులకి ఆసక్తి సన్నగిల్లిందో, ఇష్టమైన పోటిదారులు వెళ్ళిపోవడం వలన చూడటం తగ్గించారో కాని, ఎన్టీఆర్ వస్తున్న వీకెండ్ ఎపిసోడ్స్ కి కూడా టీఆర్పి క్రమంగా తగ్గడం మేకర్స్ ని కలవరపాటుకి గురిచేస్తోంది.
మరోవైపు రానా హోస్టింగ్ చేసే నెం1 యారి జెమినిని నెం1 చేసింది.బాలకృష్ణ వచ్చిన ఎపిసోడ్ అదే రోజు ఎన్టీఆర్ వచ్చిన బిగ్ బాస్ ఎపిసోడ్ కంటే ఎక్కువ టీఆర్పి తీసుకురావడం విశేషం.
ఆ సినిమా కథ చెబితే తెలుగు హీరోలందరూ రిజెక్ట్ చేశారు: వెంకీ అట్లూరి