మోక్షజ్ఞ కోసం ఉప్పెన దర్శకుడితో బాలయ్య చర్చలు??

యంగ్‌ దర్శకులకు హిట్‌ పడితే వారి వెంట యంగ్‌ హీరోలు పరుగులు పెట్టడం.

అతడితో సినిమా చేసేందుకు ఉవ్విల్లూరడం అనేవి చాలా కామన్‌ గా కనిపించే విషయాలు.

ఇప్పుడు బుచ్చి బాబు వెంట యంగ్‌ హీరోలు మరియు సీనియర్‌ స్టార్స్‌ కూడా పడుతున్నారు.

ఇప్పటికే అక్కినేని అఖిల్‌ కోసం బుచ్చి బాబును నాగార్జున సంప్రదించాడు అంటూ వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.

అఖిల్‌ మరియు బుచ్చి బాబుల కాంబోలో సినిమా దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యిందని నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

దాంతో అక్కినేని అభిమానులు ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు .ఇలాంటి సమయంలో బాలకృష్ణ కూడా బుచ్చి బాబును తన కొడుకు మోక్షజ్ఞ కోసం ఒక కథను సిద్దం చేయాల్సిందిగా సూచించినట్లుగా సమాచారం అందుతోంది.

"""/"/ బాలకృష్ణ ఇటీవల ఉప్పెన సినిమా చూసి అభినందించిన విషయం తెల్సిందే.ఆ సమయంలోనే మంచి లవ్‌ స్టోరీ కమ్‌ కమర్షియల్‌ ఎంటర్‌ టైనర్‌ స్క్రిప్ట్‌ ఉంటే తప్పకుండా మోక్షజ్ఞ ను నీ చేతిలో పెడుతాను అంటూ హామీ ఇచ్చాడట.

ఈ బాధ్యతను మైత్రి వారికి అప్పించినట్లుగా కూడా సమాచారం అందుతోంది.మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మాణంలో మోక్షజ్ఞను పరిచయం చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా బాలయ్య ప్రకటించాడు.

ఇప్పటికే మైత్రి వారి బ్యానర్‌ లో బాలయ్య ఒక సినిమా చేసేందుకు కమిట్‌ అయ్యాడు.

ఆ సినిమా భారీ అంచనాల నడుమ గోపీ చంద్‌ మలినేని దర్శకత్వంలో పట్టాలెక్కబోతుంది.

ఈ సమయంలోనే మోక్షజ్ఞ ను కూడా పరిచయం చేయాల్సిందిగా మైత్రి వారికి బాలయ్య చెప్పడం వారి పట్ల ఏ రేంజ్‌ లో నమ్మకం వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

ఒక వేళ బుచ్చి బాబు దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా మరో లెవల్‌ లో సినిమా ఉంటుందని ఇప్పటి నుండే నందమూరి అభిమానులు అంటున్నారు.

ఇప్పటి వరకు అయితే బుచ్చి బాబు తదుపరి సినిమా గురించి అధికారికంగా క్లారిటీ లేదు.

మరి ముందు ముందు ఎవరితో ఆయన సినిమాలు చేస్తాడో చూడాలి.

అమ్మాయి గెటప్ లో అదిరిపోయిన విశ్వక్ సేన్.. లైలా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్!