బాలయ్య రోల్ అలా ఉండబోతుందా.. ఇక రికార్డులు బద్దలే!
TeluguStop.com
నందమూరి నటసింహం బాలకృష్ణ( Nandamuri Balakrishna ) కెరీర్ లో 109వ( NBK109 ) సినిమాను ఈ మధ్యనే అఫిషియల్ గా ప్రకటించిన విషయం తెలిసిందే.
యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను బాలయ్య పుట్టినరోజు నాడు అఫిషియల్ గా లాంచ్ చేసారు.
అప్పటి నుండి ఏదొక రూపంలో రూమర్స్ వస్తూనే ఉన్నాయి.దీంతో సినిమా స్టార్ట్ కాకుండానే ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి.
"""/" /
ఈ ప్రాజెక్ట్ లాంచ్ తోనే భారీ అంచనాలు క్రియేట్ అవ్వగా ఇప్పుడు ఈ సినిమా గురించి లేటెస్ట్ గా అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది.
ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను హైదరాబాద్ లోనే స్టార్ట్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ యాక్షన్ ఎపిసోడ్ తోనే స్టార్ట్ కానుంది అని టాక్.
ఇప్పటికే అందుకోసం భారీ సెట్ కూడా వేస్తున్నారు.ఇక తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం బాలయ్య క్యారెక్టర్ కి ఒక వీక్ నెస్ ఉంటుందని అది కూడా మతిమరుపు అని టాక్.
ఈ మతిమరుపు టాపిక్ మీదనే యాక్షన్ అండ్ కామెడీ సీన్స్ మెయిన్ హైలెట్ గా నిలుస్తుందట.
ఎప్పటిలా బాలయ్య యాక్షన్ మూవీతో కాకుండా ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతుంది.
"""/" /
ఇక ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నాడని ఇప్పటికే పలు వార్తలు వైరల్ అయ్యాయి.
ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఫార్చ్యూన్ 4 ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇక ప్రజెంట్ బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన భగవంత్ కేస( Bhagavanth Kesari )రి అక్టోబర్ 19న రిలీజ్ కానుంది.
ఈ లోపులోనే ఈ సినిమా షూట్ స్టార్ట్ కానుందని తెలుస్తుంది.
స్విట్జర్లాండ్‌లో గ్రాడ్యుయేషన్ డే .. లెహంగాలో వచ్చిన భారతీయ విద్యార్ధిని