మొదలెట్టేసిన ‘NBK109’.. మేకర్స్ సాలిడ్ పోస్టర్ రిలీజ్.. అంచనాలు పీక్స్!

నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) కెరీర్ లో 109వ సినిమాను( NBK109 ) ఇప్పటికే అఫిషియల్ గా ప్రకటించిన విషయం తెలిసిందే.

యంగ్ డైరెక్టర్ బాబీ( Director Bobby ) దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై అప్పుడే అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి.

బాలయ్య కూడా ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధం అయ్యాడు.

దీంతో ఈ సినిమాను ఈ రోజు నుండి స్టార్ట్ చేసినట్టు మేకర్స్ ఒక పవర్ ఫుల్ పోస్టర్ ద్వారా తెలిపారు.

ఈ పోస్టర్ లో గొడ్డలి, రేబాన్ కళ్ళ జోడుతో పాటు అందులో కొన్ని యాక్షన్ విజువల్స్ ను చూపించారు.

ఈ పవర్ ఫుల్ పోస్టర్ తోనే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం అవుతుంది.

"""/" / చూడాలి ఈ సినిమాలో బాబీ ఇంకెన్ని ఎలిమెంట్స్ చూపిస్తాడో.అయితే ఇది బాలయ్య టైప్ యాక్షన్ డ్రామా కాదని ఇదొక ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో సాగిపోయే ఎమోషనల్ డ్రామా( Emotional Drama ) అని తెలుస్తుంది.

అయితే ఇందులో ఫ్లాష్ బ్యాక్ మాత్రం పాలిటిక్స్ నేపథ్యంలో ఉంటుందట. """/" / ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఫార్చ్యూన్ 4 ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తుండగా నిర్మాతలుగా నాగ వంశీ,( Nagavamshi ) త్రివిక్రమ్ భార్య సౌజన్య( Sowjanya ) వ్యవహరించ బోతున్నారు.

థమన్ సంగీతం అందించబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.

ఇక ఇటీవలే బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అందుకుంది.

రూ.16 లక్షలు నావే.. బ్యాంకు తప్పిదానికి రైతు షాక్ ట్రీట్‌మెంట్?