బాలయ్య కోసం మూడేళ్లు పెళ్లి వాయిదా వేసుకున్న అభిమాని.. ఇదేం అభిమానం రా సామి!

సాధారణంగా సినిమా హీరోలకు ఎంతోమంది అభిమానులు ఉంటారు.ఇలా ఒకసారి ఒక హీరోని అభిమానిస్తున్నారు అంటే ఇక ఆ అభిమాన హీరోల కోసం ఏం చేయడానికైనా అభిమానులు వెనకాడరు.

ఈ క్రమంలోనే నందమూరి నరసింహ బాలయ్యకు ఎలాంటి స్థాయిలో అభిమానుల ఆదరణ ఉందో మనకు తెలిసిందే.

ఇలా బాలకృష్ణకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ బాలయ్య సినిమా విడుదల సమయంలో వారు చేసే రచ్చ చూస్తేనే అర్థమవుతుంది.

అయితే బాలయ్య పై ఉన్నటువంటి అభిమానంతో ఓ అభిమాని చేసిన పని తెలిస్తే కనుక ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేయక మానరు.

తన పెళ్లికి ఎలాగైనా తన అభిమాన హీరో వస్తేనే తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మెడలో తాళి కడతానని భీష్మించుకొని కూర్చున్నాడు విశాఖపట్నం పెందుర్తికి చెందిన కోమలి పెద్ది నాయుడు.

ఈయన బాలయ్యకు పిచ్చి అభిమాని అతను వస్తేనే తాను పెళ్లి చేసుకుంటానని ఖరాఖండిగా చెప్పేశారు.

2019లో పెద్ది నాయుడుకి గౌతమీ ప్రియ అనే అమ్మాయితో వివాహం నిశ్చయమైంది.అదే ఏడాది నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు.

అయితే అదే ఏడాదిలో పెళ్లి నిర్ణయించడంతో ఆ పెళ్లికి బాలకృష్ణ వస్తారని బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా ఆయనకు ఆహ్వానం పంపారు కానీ ఆయన రాకపోవడంతో పెద్ది నాయుడు ఈ పెళ్లి వాయిదా వేశారు.

"""/" / కరోనా సమయంలో మరోసారి పెళ్లి పెట్టుకున్న కరోనా ప్రభావం కారణంగా బాలకృష్ణ పెళ్ళికి రాకపోవడంతో ఈయన అప్పుడు కూడా పెళ్లి ఆపేశారు.

అయితే బాలకృష్ణ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ పెళ్లికి హాజరు కాలేకపోయారు.తద్వారా బాలయ్య వచ్చేవరకు పెళ్లి చేసుకునేది లేదని ఈయన పెళ్లి వాయిదా వేస్తూనే వచ్చారు.

ఇకపోతే బాలయ్య సమయానికి అనుగుణంగా ఈయన పెళ్లి ముహూర్తం నిర్ణయించుకొని గత కొద్ది రోజులుగా తన పెళ్లిని పెట్టుకున్నప్పటికీ బాలకృష్ణ ఆ పెళ్లికి రాకపోవడంతో ఆయన మరోసారి పెళ్లి వాయిదా వేశారు.

ఇక బాలకృష్ణ తప్పకుండా వస్తానని హామీ ఇవ్వడంతో మార్చి 11వ తేదీ మరోసారి ముహూర్తం నిర్ణయించారు.

"""/" / ఈసారైనా బాలయ్య పెళ్లికి వచ్చి ఈ అభిమాని పెళ్లి జరుగుతుందా లేదా గత మూడు సంవత్సరాలుగా వాయిదా పడినట్లు వాయిదా పడుతుందా అని ప్రతి ఒక్కరూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇలా పెళ్లి వాయిదా వేయడంతో వధువు కుటుంబ సభ్యులు ఎలాంటి అభ్యంతరం తెలపలేదని ఎందుకంటే వధువు కుటుంబ సభ్యులు కూడా బాలయ్యకు వీరాభిమానులు కావడంతో ఇది సాధ్యమైందని వరుడు పెద్ది నాయుడు తెలియజేశారు.

ఇక బాలయ్య తన పెళ్లికి వస్తానని చెప్పడంతో అతనికి ఘన స్వాగతం పలకడం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ బాలుడు మృత్యుంజయుడా.. మూడో అంతస్తు నుంచి పడినా బతికే ఉన్నాడు.. వీడియో చూడండి!