ఆంధ్రావాలా మూవీని తలదన్నేలా బాలయ్య మూవీ ఈవెంట్.. అన్ని లక్షల మంది వస్తారా?
TeluguStop.com
స్టార్ హీరో బాలయ్యకు( Star Hero Balayya ) గత కొన్నేళ్లుగా కెరీర్ పరంగా కలిసొస్తోంది.
కూతురు తేజస్విని( Tejaswini ) ఇస్తున్న సలహాలతో పాటు బాలయ్య కెరీర్ పై ప్రత్యేక దృష్టి పెట్టడంతో మంచి ప్రాజెక్ట్స్ లో మాత్రమే ఆయన భాగమవుతున్నారు.
బాలయ్య బాబీ కాంబో మూవీ డాకు మహారాజ్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమా వేరే లెవెల్ లో ఉండబోతుందని క్లారిటీ వచ్చేసింది.అయితే డాకు మహారాజ్ మూవీ( Daku Maharaj Movie ) ఈవెంట్ జనవరి నెల 8వ తేదీన అమరావతిలో జరిగే ఛాన్స్ ఉందని ప్రాథమికంగా సమాచారం అందుతోంది.
ఈ ఈవెంట్ కు చంద్రబాబు గెస్ట్ గా హాజరయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.
అప్పట్లో ఆంధ్రావాలా మూవీ ( Andhrawala Movie )ఈవెంట్ ఒకింత సంచలనం అయింది.
ఆ ఈవెంట్ కు అప్పట్లో ఏకంగా 10 లక్షల మంది హాజరయ్యారు.ఆ ఈవెంట్ ను తలదన్నేలా ఈ ఈవెంట్ ను నిర్వహించనున్నారని తెలుస్తోంది.
"""/" /
పుష్ప ది రూల్ ఈవెంట్ తాజాగా జరగగా ఈ ఈవెంట్ అంచనాలకు మించి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.
అదే విధంగా డాకు మహారాజ్ ఈవెంట్ ను సైతం సక్సెస్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
చంద్రబాబు ఈవెంట్ కు హాజరైతే ఏ రేంజ్ లో సందడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు.
డాకు మహారాజ్ మూవీ కోసం సితార నిర్మాతలు ఒకింత భారీ స్థాయిలో ఖర్చు చేశారు.
"""/" /
తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుండటం గమనార్హం.
పుష్ప ది రూల్ మూవీ డాకు మహారాజ్ నెల రోజుల గ్యాప్ లోనే రిలీజ్ కానున్నాయి.
డాకు మహారాజ్ బడ్జెట్ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
డాకు మహారాజ్ ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆంధ్రావాలాను మించి ఈ ఈవెంట్ కు జనం హాజరు కానున్నారని తెలుస్తోంది.
బీట్ రూట్ జ్యూస్ తలకు రాయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?