బాలయ్య తోడళ్లుడు సినిమా నిర్మాత అని మీకు తెలుసా?

తెలుగు సినిమా పరిశ్రమలో వారసత్వం అనేది కామన్ గా మారింది.ఒక్కరు సినిమా పరిశ్రమలో అడుగు పెడితే చాలు.

వాళ్లను ఆసరాగా చేసుకుని.తరాలకు తరాలు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు.

అలా మూడు తరాల సంది తెలుగు సినిమా పరిశ్రమలో హవా కొనసాగిస్తున్నారు నందమూరి వారసులు.

సీనియర్ ఎన్టీఆర్ మొదలుకొని.బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ వరకు తర తరాలుగా హీరోలు వస్తూనే ఉన్నారు.

హీరోలుగా మాత్రమే కాదు.ఈ ఫ్యామిలీ నుంచి దర్శకులుగా, నిర్మాతలుగా కూడా మరికొంత మంది ఉన్నారు.

నందమూరి కుటుంబం నుంచి విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ తనయుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు బాలయ్య.

నాలుగు పదుల సినీ కెరీర్ లో తిరుగులేని హీరోగా ముందుకు సాగుతున్నాడు.స్టార్ హీరోగా మారి ఎన్నో అద్భుత సినిమాలను చేశాడు.

ఆయనే కాదు.తన సన్నిహితులు, బంధువులు కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

బాలయ్య తోడళ్లుడు సైతం మంచి నిర్మాతగా మారాడు.ఆయన మరెవరో కాదు ఎంఆర్ వి ప్రసాద్.

పారిశ్రామిక వేత్తల కుటుంబానికి చెందిన ప్రసాద్ అమెరికాలోనే అలబామా వర్సిటీలో ఎంబీఏ కంప్లీట్ చేశాడు.

ప్రసాద్ కు మొదట్లో సినిమాలు అంటే ఆసక్తి ఉండేది కాదు.బాలయ్యతో సాన్నిహిత్యం పెరిగాక.

సినిమాల పట్ల ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు.ఈ నేపథ్యంలోనే 80వ దశకంలో బాలయ్య నటించిన పలు సూపర్ హిట్ సినిమాల నిర్మాణ వ్యవహారాల్లో ఆయన భాగస్వామ్యం అయ్యారు.

"""/"/ అనంతరం బాలయ్య, ప్రసాద్ కలిసి ప్రియదర్శిని-బ్రాహ్మణి ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి బాలగోపాలుడు సినిమాను నిర్మించారు.

ఈ సినిమాతోనే కల్యాణ్ రామ్ బాల నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఆ సినిమా తర్వాత ప్రసాద్ నిర్మాతగా నిలదొక్కుకున్నాడు.

అనంతరం బాలయ్యతో మరికొన్ని సినిమాలు నిర్మించాడు.1999లో సుల్తాన్‌ సినిమా చేసి హిట్ కొట్టాడు.

ఆ తర్వాత ఓ సినిమా ఫ్లాప్ అయ్యింది.అనంతరం కొద్ది రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు.

మళ్లీ 2006లో వచ్చిన అల్లరి పిడుగు మంచి హిట్ అందుకుంది.మంచి లాభాలు వచ్చాయి.

అటు 2019లో బాల‌య్య‌ నిర్మించిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహనాయకుడు సినిమాల‌కు ప్ర‌సాదే నిర్మాణ బాధ్యతలు తీసుకున్నాడు.