అన్ స్టాపబుల్ షో విషయంలో బాలయ్య పెట్టిన కండీషన్లు వింటే షాకవ్వాల్సిందే!

బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో సీజన్1 సక్సెస్ కాగా ప్రభాస్, పవన్ ఎపిసోడ్ల వల్ల సీజన్2 కూడా ఊహించని రేంజ్ లో సక్సెస్ అయింది.

ఈ ఏడాదే అన్ స్టాపబుల్ సీజన్3 మొదలుకానుండగా త్వరలో సీజన్3 కు సంబంధించి షాకింగ్ అప్ డేట్స్ వెల్లడి కానున్నాయని సమాచారం అందుతోంది.

అయితే అన్ స్టాపబుల్ షో విషయంలో బాలయ్య పెట్టిన కండీషన్ల గురించి షాకింగ్ విషయాలు రివీల్ అయ్యాయి.

దర్శకుడు బీవీఎస్ రవి ఈ షో కోసం పని చేసిన సంగతి తెలిసిందే.

ఒక ఇంటర్య్వూలో బీవీఎస్ రవి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.అన్ స్టాపబుల్ షో కోసం చంద్రబాబును రెండుసార్లు కలిశామని ఆయన మీరు ఏదైనా అడగండి జవాబు చెప్పడానికి నేను రెడీ అని చెప్పారని బీవీఎస్ రవి చెప్పుకొచ్చారు.

ఇబ్బందికరమైన ప్రశ్నలు అడుగుతామని చెప్పగా చంద్రబాబు ఏం అడుగుతారు అన్నారని బీవీఎస్ రవి పేర్కొన్నారు.

"""/"/ లోకేశ్ మంగళగిరిలో ఓడిపోయారు కదా అది అడుగుతామని ఆ తర్వాత లోకేశ్ ఫోటోల గురించి అడుగుతామని అన్నానని ఆయన ఓకే అన్నారని బీవీఎస్ రవి చెప్పుకొచ్చారు.

బాలయ్యకు ఫస్ట్ ఒకసారి చెప్పిన విషయం రెండోసారి చెబితే కోపం వస్తుందని బీవీఎస్ రవి తెలిపారు.

బాలయ్యకు ఏ ప్రశ్న అడగటానికి అయినా ఓకే అని అయితే గెస్ట్ లను ఇబ్బంది పెట్టే విధంగా ప్రశ్నలు అడిగితే మాత్రం నచ్చదని బీవీఎస్ రవి కామెంట్లు చేశారు.

"""/"/ వాళ్లకు ఓకే అయితే నాకు ఏదైనా ఓకే అని గెస్ట్ లకు ఇష్టం లేకుండా ప్రశ్నలు అడగనని బాలయ్య చెప్పారని తెలుస్తోంది.

అన్ స్టాపబుల్ షో నిర్వాహకులకు బాలయ్య పెట్టిన షరతు ఇదేనని బోగట్టా.బాలయ్య చంద్రబాబు కాంబో ఎపిసోడ్ షూట్ ఆరు గంటల పాటు జరిగిందని బీవీఎస్ రవి తెలిపారు.

బిల్లా మూవీ చూసి అమ్మ చెప్పిన మాటకు షాకయ్యాను.. అనుష్క సంచలన వ్యాఖ్యలు వైరల్!