2025 సంక్రాంతికి చిరంజీవి, బాలయ్య, వెంకీ సినిమాలు.. పోటీ మామూలుగా ఉండదంటూ?
TeluguStop.com
ఈ ఏడాది డిసెంబర్ అలాగే వచ్చే ఏడాది జనవరి ఈ రెండు నెలలు టాలీవుడ్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ లు మొత్తం దద్దరిళ్లనున్నాయి.
థియేటర్లు అన్నీ ఫుల్ ఫైర్ మోడ్ లోకి వెళ్లిపోతాయి.అందుకు గల కారణం స్టార్ హీరోల సినిమాలు వరుసగా విడుదల కావడం.
వరుసగా పాన్ ఇండియా సినిమాలు విడుదల కావడానికి సిద్ధం కాబోతున్నాయి.డిసెంబర్ లో బన్నీ పుష్ప 2 సినిమా రానుంది.
ఒక రోజు ముందుగా ప్రీమియర్లతోనే పండగ మొదలైపోతుంది.అలాగే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్( Game Changer) రెండు వారాల గ్యాప్ తో విడుదల కానుంది.
"""/" /
అది కూడా బాగా వచ్చిందని, దర్శకుడు శంకర్ పక్కా కమర్షియల్ సినిమా అందించబోతున్నాడని టాక్ వుంది.
ఆ తర్వాత రెండు వారాల గ్యాప్ తో సంక్రాంతికి సినిమాలు విడుదల అవుతాయి.
ఏకంగా ముగ్గురు సీనియర్ హీరోలు సంక్రాంతికి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధం అయ్యారు.ఆ ముగ్గురు హీరోలు మరెవరో కాదు.
మెగాస్టార్- యువి సంస్థ విశ్వంభర సినిమా రెడీ అవుతోంది.ఇది భారీ పాన్ ఇండియా సినిమా.
అలాగే బాలకృష్ణ- బాబీ( Balakrishna, Bobby ) కాంబినేషన్ సితార సినిమాను కూడా సంక్రాంతికే ఫిక్స్ చేసారు.
ఇక వెంకటేష్- అనిల్ రావిపూడి- దిల్ రాజు సినిమాను కూడా సంక్రాంతి బరిలోకి దింపబోతున్నారు.
"""/" /
ఇటీవలే లెంగ్తీ షెడ్యూలును పూర్తి చేసుకుందీ ఈ సినిమా.ఇలా ఈ ముగ్గురు హీరోల సినిమాలు సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి.
అయితే ఈసారి నాగార్జున వచ్చే అవకాశాలు లేనట్లు కనిపిస్తున్నాయి.కానీ నాగార్జున తనయుడు నాగచైతన్య ప్రస్తుతం థండెల్ సినిమా( Thandel )లో నటిస్తున్నారు.
మరి ఈ సినిమా ఏమైనా సంక్రాంతి బదిలో నిలుస్తుంది ఏమో చూడాలి మరి.
అలా అయితే యువి, గీతా, దిల్ రాజు, సితార సంస్థల నుంచి ఒక్కో సినిమా రావచ్చు.
కానీ మెగాస్టార్ సినిమా వుండగా గీతా సంస్థ సినిమా వేసే పని చేయకపోవచ్చు.
ఏది ఏమైనప్పటికీ ముగ్గురు స్టార్ హీరోలు ఈసారి బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నారు.
మరి వీరిలో ఎవరు సక్సెస్ గా నిలుస్తారో చూడాలి మరి.
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?