బాలయ్య అభిమానులకు బంపర్ ఆఫర్.. ఆరోజే మోక్షజ్ఞ తొలి మూవీ అప్ డేట్స్ రానున్నాయా?

స్టార్ హీరో బాలకృష్ణ( Balakrishna ) కొన్ని నెలల క్రితం వరకు పొలిటికల్ కార్యక్రమాలతో బిజీ కావడం వల్ల మోక్షజ్ఞ ( Nandamuri Mokshagna )కెరీర్ పై పెద్దగా దృష్టి పెట్టలేదు.

అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బాలయ్య మోక్షజ్ఞ కెరీర్ పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు.

మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని ఇప్పటికే ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే.

బాలయ్య నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టి 50 సంవత్సరాలు( 50 Years ) పూర్తైంది.

సెప్టెంబర్ నెల 1వ తేదీన కూకట్ పల్లిలో ఇందుకు సంబంధించిన వేడుక జరగనుండగా ఆ వేడుకలోనే బాలయ్య మోక్షజ్ఞను పరిచయం చేయనున్నారని సమాచారం అందుతోంది.

ఆరోజే మోక్షజ్ఞ తొలి సినిమాకు సంబంధించిన విశేషాలను సైతం వెల్లడించే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.

సెప్టెంబర్ నెల 6వ తేదీ మోక్షజ్ఞ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. """/" / మోక్షజ్ఞ తొలి సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా సొంత బ్యానర్ లోనే ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ఈ సినిమాకు అన్ని అంశాలకు సంబంధించి ఖర్చు విషయంలో రాజీ పడే ఛాన్స్ ఉండదు.

మోక్షజ్ఞకు తొలి సినిమాతోనే భారీ ఇండస్ట్రీ హిట్ దక్కేలా బాలయ్య ప్లాన్స్ ఉన్నాయని సమాచారం అందుతోంది.

బాలయ్య కూడా మోక్షజ్ఞ తొలి సినిమాలో కనిపించే ఛాన్స్ అయితే ఉంది. """/" / మోక్షజ్ఞ ఇప్పటికే నటన పరంగా శిక్షణ తీసుకున్నారని సమాచారం అందుతోంది.

మోక్షజ్ఞ కెరీర్ పరంగా మరింత ఎదిగి టాలీవుడ్ టాప్ హీరోలలో( Top Heroes Of Tollywood) ఒకరిగా ఉండాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మోక్షజ్ఞ తొలి సినిమా సక్సెస్ సాధిస్తే రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది.

బాలయ్య కెరీర్ పరంగా భారీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా ఆ సినిమాలు భారీ హిట్లుగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

బిగ్ బాస్ షోలో వచ్చిన రోజే ఎలిమినేట్.. ఇలా చేయడం మరి దారుణం అంటూ?