రెండు రోజుల్లోనే అక్కడ బ్రేక్ ఈవెన్... అఖండ జోరు అదుర్స్

తెలుగు సినీ ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఎదురు చూస్తున్న రోజులు వచ్చినట్లుగానే అనిపిస్తున్నాయి.

కరోనాకు ముందు ఉన్న రోజులు మళ్లీ వచ్చినట్లుగానే ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

పెద్ద ఎత్తున అంచనాలున్న అఖండ సినిమా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

సినిమాకు దక్కిన పాజిటివ్‌ రెస్పాన్స్ తో భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి.ఈమద్య కాలంలో పెద్ద సినిమాలైనా చిన్న సినిమాలైనా మొదటి వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ సాధించాలి.

అలా సాధించలేక పోతే ఆ సినిమా ప్లాప్ గానే పరిగణిస్తారు.అయితే అఖండ సినిమా యూఎస్ లో ఏకంగా రెండు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ సాధించింది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను 5 లక్షల డాలర్లకు ఓవర్సీస్ రైట్స్ ను అమ్మడం జరిగింది.

మొదటి రెండు రోజుల్లోనే ఆ మొత్తం వచ్చేసింది. """/" / ఇక మీదట వచ్చే వన్నీ కూడా లాభాలే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

ఇంత సులభంగా అఖండ బ్రేక్ ఈవెన్‌ సాధిస్తుందని ఏ ఒక్కరు ఊహించలేదు.ముఖ్యంగా యూఎస్ లో ఈ సినిమా ఆ రేంజ్‌ లో విజయాన్ని సొంతం చేసుకోవడం అభిమానులకు ఫుల్‌ ఖుషీగా ఉంది.

బోయపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్రేక్ ఈవెన్‌ దిశగా అడుగులు వేస్తోంది.

ఒకటి రెండు ఏరియాల్లో రెండు మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్‌ సాధించబోతుంది.మొత్తం బ్రేక్‌ ఈవెన్‌ కు ఈ వీకెండ్‌ పడుతుందని అంటున్నారు.

మొత్తానికి అన్ని ఏరియాల్లో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయితే ఖాయం అంటున్నారు.

 బాలయ్య కు జోడీగా ప్రగ్యా జైస్వాల్‌ నటించగా శ్రీకాంత్‌ విలన్ గా నటించాడు.

బాలయ్య ద్వి పాత్రాభినయం చేసిన ఈ సినిమా బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్‌ హిట్‌ గా నిలిచింది.

Pallavi Prashanth : జైలు కూడు బాగుంది…నన్ను చూసిన ఖైదీలు అలా మాట్లాడేవారు: పల్లవి ప్రశాంత్