టెన్షన్ పెడుతున్న బాలయ్య అఖండ సినిమా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

టాలీవుడ్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు.

ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ తాజాగా నటిస్తున్న చిత్రం అఖండ.ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా భారీ అంచనాల నడుమ రూపొందనున్న విషయం అందరికి తెలిసిందే.కానీ ఈ సినిమా విడుదల తేదీపై ఇప్పటి వరకూ క్లారిటీ రాలేదు ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి.

అఖండ దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు అని ప్రకటించారు.కానీ తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాని డిసెంబర్ 24న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయంపై అధికారికంగా సమాచారం వెలువడాల్సి ఉంది.అయితే ఇప్పటికే బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో సింహ, లెజెండ్ లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చిన విషయం అందరికి తెలిసిందే.

ఇక వీరిద్దరి కాంబినేషన్లో మరొకసారి సినిమా రావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ కూడా పూర్తయింది.ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతోంది.

ఈ సినిమాపై ఉన్న అంచనాలు తగ్గట్టుగానే అదిరే బిజినెస్ ను కూడా జరుపుకుంటోంది అని తెలుస్తోంది.

అలాగే ఈ సినిమా నైజాం హక్కులు కూడా భారీగా దర పలికినట్లు తెలుస్తోంది.

ఈ నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు వేగంగా 19 కోట్లు కొనుగోలు చేశారని సమాచారం.

ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నటిస్తోంది.అలాగే తమన్ సంగీతాన్ని అందించగా, ద్వారకా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి సినిమా నిర్మిస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో దివంగత హీరో కృష్ణపై చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు..!!