#BB3 ఫస్ట్ రోర్: పంచకట్టుతో పిచ్చెక్కించిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి సంబంధించిన అప్‌డేట్‌ను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు అదిరిపోయే రీతిలో బాలయ్య గిఫ్ట్ అందించాడు.

ఈ సినిమాలోని టీజర్‌ను సడెన్ సర్‌ప్రైజ్‌గా రిలీజ్ చేసిన చిత్ర యూనిట్, ఈ సినిమాతో బాలయ్య మరోసారి తనదైన మార్క్ వేయడం పక్కా అని ఎందుకు అంటున్నారో ఈ టీజర్ ద్వారా నిరూపించారు.

బాలయ్య-బోయపాటి కాంబో అంటే బాక్సాఫీస్‌కు ఎందుకు భయమో మరోసారి ఈ టీజర్ నిరూపించింది.

ఈ టీజర్‌లో బాలయ్య పంచకట్టుతో ఎంట్రీ ఇచ్చేటప్పుడు థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు గూస్‌బంప్స్ రావడం ఖాయం.

ఇక బాలయ్య ఎంట్రీతోనే యాక్షన్‌తో అదరగొట్టాడు.బాలయ్య తనదైన స్టయిల్‌లో ఇచ్చే ఆ వార్నింగ్‌కు ప్రత్యర్ధులు పంచలు తడుపుకోవడం ఖాయం.

ఈ డైలాగ్‌ను బోయపాటి మార్క్‌కు అనుగుణంగా పక్కా మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసి బాలయ్య చెప్పిన విధానం సూపర్.

మొత్తానికి బాలయ్య ఈసారి అదిరిపోయే సినిమాతో ప్రేక్షకుల మందుకు రానున్నట్లు ఈ టీజర్ చూస్తే తెలుస్తోంది.

కాగా బాలయ్య విశ్వరూపంలో ఇది శాంపిల్ మాత్రమే అని, అసలు సినిమా మున్ముందు ఉందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇక ఈ టీజర్ అల్టిమేట్‌గా ఉండటంతో నందమూరి అభిమానులు అప్పుడే సినిమా 100 రోజులు ఆడినంత పండగ చేస్తున్నారు.

ఓవరాల్‌గా చూస్తే, ఈ రోజు బాలయ్య తన అభిమానుల ఆకలిని పూర్తిగా తీర్చేశాడని చెప్పాలి.

మరి బాలయ్య సింహగర్జనను మీరు ఓసారి చూడండి.

హీరో రాజేంద్రప్రసాద్‌తో కాకుండా బాబు మోహన్‌తో సౌందర్య డ్యాన్స్.. ఎందుకో తెలుసా.. ?