ప్రస్తుతానికి బాలయ్య, బోయపాటి మూవీ అటకెక్కినట్లేనా?

నందమూరి బాలకృష్ణ గత మూడు సంవత్సరాలుగా అపజయాలు తప్ప విజయాలను చవి చూస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.

ఈ సమయంలో తనకు గతంలో రెండు హిట్స్ ఇచ్చిన బోయపాటితో సినిమాకు రెడీ అయ్యాడు.

ఖచ్చితంగా బాలకృష్ణ ఈ సారి బోయపాటి తో హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటూ అంటా నమ్మకం గా ఉన్నారు.

ఈ సినిమాలో బాలకృష్ణ ను బోయపాటి అఘోరాగా చూపించబోతున్న విషయం ఇప్పటికే తెలిసిందే.

సినిమా కథ మరియు కథనం దృష్ట్యా ఎక్కువగా వారణాసి, కాశి ఇంకా హిమాలయాల్లో చిత్రీకరించాలనుకున్నారు.

ఇప్పటికే పలు ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగింది.మిగిలిన షూట్ ను హిమాలయాలు, వారణాసి కాశి లో చేయాల్సి ఉంది.

కానీ కరోనా కారణంగా అక్కడ ఇప్పట్లో షూటింగ్ కు సాధ్యం అయ్యే పరిస్థితి లేదు.

దాంతో సినిమాను ఎం చేయాలా అని దర్శకుడు బోయపాటి జుట్టు పీక్కుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం షూటింగ్ కు ఎక్కడ కూడా అనుమతులు లేవు.ఒక వేళ రాబోయే నెల రెండు నెలల్లో షూటింగ్ కు అనుమతులు ఇస్తే మాత్రం ఇండోర్ షూటింగ్స్ కు మాత్రమే అనుమతులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఆ కారణంగా బాలకృష్ణ మూవీ ఆలస్యం అయ్యే అవకాశం ఉందంటున్నారు.బాలయ్య మూవీని ఇండోర్ లో పూర్తి చేయడం కష్టం అని అందుకే సినిమాను కొన్నాళ్లపాటు వాయిదా వేసి బాలయ్య మరో ప్రాజెక్ట్ ను మొదలు పెడతాడేమో అంటున్నారు.

చాక్లెట్ ప్లేన్‌గా ఉందని కస్టమర్ ఫిర్యాదు.. కంపెనీ అతనికి చెల్లించిన నష్టపరిహారం ఎంతంటే..?