బాలయ్య ఉండగా టైగర్ నాగేశ్వరరావు కి ఆ టార్గెట్ సాధ్యమేనా?
TeluguStop.com
మాస్ మహారాజా రవితేజ( Ravi Teja ) హీరోగా వంశీ దర్శకత్వం లో భారీ బడ్జెట్ తో రూపొందిన టైగర్ నాగేశ్వరరావు సినిమా ( Tiger Nageshwar Rao )భారీ వసూళ్ల ని సొంతం చేసుకోవడం ఖాయం అన్నట్లుగా అభిమానులు మరియు ప్రేక్షకులు ధీమాతో ఉన్నారు.
ఈ సినిమా ను ఈ వారం లోనే దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు తెగ ప్రచారం చేస్తున్నారు.
"""/" /
కానీ అంత సీన్ లేదు అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటే అదే రోజున నందమూరి బాలకృష్ణ( Balakrishna ) నటించిన భగవంత్ కేసరి సినిమా విడుదల అవ్వబోతుంది.
రికార్డ్ ల వర్షం కురిపించే విధంగా తమ సినిమా ఉంటుంది అంటూ రవితేజ చాలా ధీమాగా చెబుతున్నాడు.
అదే నిజం అయితే కచ్చితంగా టైగర్ నాగేశ్వరరావు కు కాస్త పోటీ తప్పదు అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బాలకృష్ణ మరియు రవితేజ గతం లో పలు సందర్భాల్లో పోటీ పడ్డారు.అందులో చాలా సార్లు కూడా బాలయ్య పై రవితేజ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
"""/" /
ఈ సారి పరిస్థితులు అనుకూలించే విధంగా కనిపించడం లేదు అంటూ స్వయంగా రవితేజ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.
రవితేజ సినిమా విషయం లో ఎలాంటి డౌట్ లేదు.కానీ బాలయ్య కి ఉన్న ఫాలోయింగ్ తో పాటు ఇతర విషయాలు కలిసి వచ్చి భగవంత్ కేసరి సినిమా( Bhagavanth Kesari, )ను ముందు నిలుపుతున్నాయి.
అందుకే టైగర్ నాగేశ్వరరావు సినిమా( Tiger Nageshwar Rao ) విషయంలో అభిమానులు కాస్త కాన్ఫిడెన్స్ ని లూజ్ అవుతున్నారు అనేది టాక్.
ఆ విషయం పక్కన పెడితే దసరా కి తమిళ్ సూపర్ స్టార్ విజయ్ నటించిన లియో ( LEO )ను కూడా విడుదల చేయబోతున్నారు.
తద్వారా దసరా పోటీని మరింత రసవత్తరంగా మార్చేస్తున్నారు.భారీ అంచనాల నడుమ రూపొందిన లియో సినిమా ను తెలుగు లో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు.
బిల్లా మూవీ చూసి అమ్మ చెప్పిన మాటకు షాకయ్యాను.. అనుష్క సంచలన వ్యాఖ్యలు వైరల్!