భగవంత్ కేసరి… కాజల్, శ్రీలీల పారితోషికం ఎంతో తెలుసా?
TeluguStop.com
నందమూరి బాలకృష్ణ హీరో గా వచ్చిన భగవంత్ కేసరి సినిమా( Bhagwant Kesari Movie ) లో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించగా.
శ్రీ లీల కీలక పాత్ర లో కనిపించింది.సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది.
సినిమా లో కాజల్ పాత్ర కు పెద్దగా ప్రాముఖ్యత లేదు.కానీ ఆమె హీరోయిన్ రోల్ అవ్వడం తో అంతా కూడా అభినందిస్తున్నారు.
ఇక శ్రీ లీల( Sri Leela ) విషయానికి వస్తే ఆమె నటించిన విజ్జీ పాత్ర కి మంచి న్యాయం చేసింది.
"""/" /
మొత్తానికి ఇద్దరికి ఇద్దరూ కూడా భగవంత్ కేసరి సినిమా కు ప్రధాన ఆకర్షణ గా నిలుస్తున్నారు.
ఈ సినిమా లో నటించినందుకు గాను వారు భారీ మొత్తం లో పారితోషికం అందుకున్నారు.
కాజల్( Kajal ) ఒకప్పుడు రెండు కోట్ల వరకు పారితోషికం దక్కించుకుంది.కానీ ఈ మధ్య కాలంలో ఆమె కి క్రేజ్ తగ్గింది.
పైగా పెళ్లి చేసుకుని తల్లి అవ్వడం వల్ల ఆమె ను చాలా మంది లైట్ తీసుకున్నారు.
కనుక ఆమె పారితోషికం చాలా తక్కువ అయింది.ఇక పారితోషికం విషయానికి వస్తే భగవంత్ కేసరి సినిమా ను కోటి రూపాయల( Crores Of Rupees ) లోపు పారితోషికం ను ఈమె అందుకుంది అంటున్నారు.
"""/" /
ఇక శ్రీ లీల ఏకంగా రెండు కోట్ల వరకు పారితోషికం ను తీసుకుంది అంటూ వార్తలు వస్తున్నాయి.
అంటే కాజల్ కంటే రెట్టింపు పారితోషికం ను ఈమె తీసుకుంది.మొత్తానికి కాజల్ అగర్వాల్ టైమ్ లేదు.
శ్రీ లీల టైమ్ నడుస్తోంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటున్నారు.
ఇక శ్రీ లీల హీరోయిన్ గా ఇతర సినిమా ల్లో కూడా నటిస్తోంది.
ఆ సినిమా లో హీరోయిన్ గా నటించడం ద్వారా రెండు నుంచి మూడు కోట్ల వరకు పారితోషికం ను తీసుకుంటూ ఉంది.
కనుక భగవంత్ కేసరి సినిమా కి హీరోయిన్ కాకున్నా కూడా రెండు కోట్ల పారితోషికం తీసుకుందట.