బాలయ్య ఇంకా ఎప్పుడు ఈతరం ప్రేక్షకుల పల్స్‌ తెలుసుకుంటావు?

ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్‌తో రికార్డులు బద్దలు కొట్టిన ఘనత బాలకృష్ణది.ఆయన ఒక గొప్ప నటుడు అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.

ఆయన రికార్డులను ఎవరు కాదనలేరు.ప్రస్తుతం ఇండస్ట్రీ హిట్స్‌ వచ్చిన సినిమాలు కూడా ఆయన గత సూపర్‌ హిట్స్‌ ముందు దిగదుడుపే అనడంలో సందేహం లేదు.

సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు వంటి సినిమాలు తెలుగు సినిమా ట్రెండ్‌ను మార్చేశాయి.అంతటి అద్బుత విజయాలను దక్కించుకున్న బాలయ్య గత పదేళ్లుగా సినిమాలు అయితే చేస్తున్నాడు కాని అవి సక్సెస్‌ అవ్వడం లేదు.

ఈమద్య కాలంలో ప్రేక్షకుల అభిరుచి చాలా మంది.ముఖ్యంగా అతి సీన్స్‌ను ప్రేక్షకులు అస్సలు ఒప్పుకోవడం లేదు.

ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రధానంగా కోరుకుంటున్నారు.ఇవన్నీ ఉంటనే ప్రేక్షకులు ఆధరించే పరిస్థితి ఉంది.

కాని బాలయ్య మాత్రం ప్రేక్షకుల అభిరుచితో సంబంధం లేదు అన్నట్లుగా మూసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

కొత్త దర్శకులకు ఛాన్స్‌ ఇస్తే ఆయన్ను విభిన్నంగా చూపిస్తారని భావిస్తే పూరి వంటి డైరెక్టర్‌ కూడా బాలయ్యను చాలా రొటీన్‌గానే చూపించి నిరాశ పర్చాడు.

ప్రస్తుతం బోయపాటితో ఒక సినిమా చేస్తున్న బాలయ్య ఆ తర్వాత బి గోపాల్‌తో సినిమాకు రెడీ అయ్యాడు.

బి గోపాల్‌ అద్బుత చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించాడు.బాలయ్యకు కూడా ఇండస్ట్రీ హిట్స్‌ కట్టబెట్టాడు.

కాని అది అంతా గతం.ఇప్పుడు అలాంటివి పునరావృతం అవుతాయంటే ఛాన్సే లేదు.

అయినా కూడా బి గోపాల్‌నే బాలయ్య నమ్మి సినిమా చేయబోతున్నాడు.అది కూడా ఒక పాత చింతకాయ పచ్చడి వంటి కథతో.

"""/"/ ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రారంభం కాబోతుంది.బాలయ్య తదుపరి చిత్రంను బి గోపాల్‌తో చేసేందుకు కమిట్‌ అవ్వడంపై ఆయన అభిమానులే స్వయంగా పెదవి విరుస్తున్నారు.

ఇంకా ఎప్పటికి బాలయ్య ప్రేక్షకుల పల్స్‌ తెలుసుకుంటాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.

మామకు తోడుగా నిలిచిన కోడలు పిల్ల…. పిఠాపురం కోసం ఉపాసన సంచలన నిర్ణయం?