దేవాంగుల కమ్యూనిటీకి క్షమాపణలు చెప్పిన బాలయ్య.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అకర్లేదు.నందమూరి బాలకృష్ణ కు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ముందు మనందరికీ తెలిసిందే.

కాగా బాలయ్య బాబు తాజాగా నటించిన చిత్రం వీర సింహారెడ్డి.ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా బ్లాక్ పాస్టర్ హిట్ ను అందుకు ఇవ్వడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.

దాంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా బాలయ్య బాబు పేరు మారి మోగిపోతోంది.

"""/"/ ఇది ఇలా ఉంటే వీర సింహారెడ్డి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య బాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి.

ఆ వ్యాఖ్యలపై తాజాగా బాలకృష్ణ స్పందిస్తూ వివరణ ఇచ్చుకుంటూ క్షమాపణలు తెలిపారు.అసలు ఏం జరిగిందంటే.

వీరి సింహారెడ్డి ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య బాబు మాట్లాడుతూ దేవ బ్రహ్మనులకు గురువు దేవల మహర్షి, వారి నాయకుడు రావణాసురుడు అని తెలిపారు.

ఈ వాక్యలు ప్రస్తుతం వివాదస్పదంగా మారాయి.ఈ విషయంపై స్పందించిన బాలయ్య బాబు.

తన వ్యాఖ్యలపై స్పందిస్తూ బహిరంగంగా లేఖని విడుదల చేశారు.దేవాంగుల నాయకుడు రావణబ్రహ్మ అని తాను అన్న మాటల వల్ల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిసి నేను బాధపడ్డాను.

"""/"/ అయితే దురదృష్టవశాత్తు ఆ సందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమేనని బాలయ్య బాబు తెలిపారు.

దేవబ్రహ్మణ సోదర సోదరి మణులకు మీ సోదరుడు నందమూరి బాలకృష్ణ మనఃపూర్వక మనవి.

దేవా బ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అని నా కందిన సమాచారం తప్పు అని తెలిసి నాకు తెలియజెప్పిన దేవ బ్రాహ్మణ పెద్దల అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని తెలిపారు బాలయ్య బాబు.

నేనన్న మాట వల్ల దేవాంగుల మనోభావాలు దెబ్బ తిన్నాయని తెలిసి చాలా బాధపడ్డాను.

నాకు ఎవరినీ బాధ పెట్టాలన్న ఆలోచన లేదు , ఉండదని కూడా తెలుగు ప్రజలందరికీ తెలుసు.

దురదృష్టవశాత్తూ ఆసందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమే.అంతేకానీ సాటి సోదరుల మనసు గాయపరచటం వల్ల నాకు కలిగే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి.

పైగా దేవాంగులలో నా అభిమానులు చాలామంది ఉన్నారు.నావాళ్లను నేను బాధపెట్టుకుంటానా ? అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాను.

పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నాను.మీ సోదరుడు నందమూరి బాలకృష్ణ అని రాసుకు వచ్చారు బాలయ్య బాబు.

కాగా బాలయ్య బాబు లేఖ పై స్పందించిన పలువురు అభిమానులు.జై బాలయ్య అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఆ సమయంలో జబర్దస్త్ నుంచి తీసేశారు.. తిరుపతి ప్రకాష్ ఎమోషనల్ కామెంట్స్!