‘భగవంత్ కేసరి’ క్లోసింగ్ కలెక్షన్స్..కేవలం ఆ నాలుగు ప్రాంతాల్లో తప్ప అన్నిట్లో లాస్!

నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'భగవంత్ కేసరి'( Bhagavanth Kesari ) రీసెంట్ గానే దసరా కానుకగా విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ సినిమాతో పాటు రెండు క్రేజీ సినిమాలు విడుదల అయ్యినప్పటికీ కూడా బాలయ్య బాబు తన డామినేషన్ ని చూపించాడు.

ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ తీసిన సినిమా కాబట్టి ఈ చిత్రానికి ఓపెనింగ్స్ పెద్దగా లేకపోయినా ఫుల్ రన్ లో మంచి రన్ ని దక్కించుకుంది.

అసలు బ్రేక్ ఈవెన్ అసాధ్యం అని అనుకున్న ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోయారు ఈ చిత్రం రన్ ని చూసి.

ఓవరాల్ గా 68 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పుడు దాదాపుగా క్లోసింగ్ కి వచ్చేసింది.

ఒక్కసారి ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం. """/"/ ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 65 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించినట్టు తెలుస్తుంది.

అంటే బ్రేక్ ఈవెన్ మార్కుకి మూడు కోట్ల రూపాయిలు తక్కువ అన్నమాట.నైజాం, ఓవర్సీస్, కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా ప్రాంతాలలో మినహా, ఈ సినిమాకి మిగిలిన అన్నీ ప్రాంతాలలో నష్టాలు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.

లాంగ్ రన్ బాగున్నప్పటికీ ఓపెనింగ్స్ లో వెనకబడడం వల్లే ఈ చిత్రానికి క్లోసింగ్ కలెక్షన్స్( Bhagavanth Kesari Collections )) దగ్గర కి వచ్చేసరికి నష్టాల్లోకి వెళ్లిపోయిందని అంటున్నారు.

ఇప్పటికీ ఈ చిత్రం పలు థియేటర్స్ లో విజయవంతంగానే నడుస్తుంది కానీ, షేర్ వసూళ్లు రావడం దాదాపుగా తగ్గిపోయాయి.

షేర్ వచ్చినా కూడా అది అంతంత మాత్రం గానే ఉంది.ఓవరాల్ గా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సెమి హిట్ గా నిల్చింది అని చెప్పొచ్చు.

"""/"/ కెరీర్ లో చాలా కాలం తర్వాత బాలయ్య బాబు( Balakrishna ) ఇలా వరుసగా మూడు హిట్స్ కొట్టడం జరిగింది.

వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు చేస్తూ కెరీర్ లో బాగా వెనకబడ్డ బాలయ్య, ఇక సినిమాలు ఆపేస్తే మంచిది అని అభిమానులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్న రోజుల్లో వచ్చిన 'అఖండ'( Akhanda ) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం తో మొదలైన బాలయ్య జైత్ర యాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఈ బాక్స్ ఆఫీస్ జైత్ర యాత్ర ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.

విశ్వంభర మూవీ ప్రొడ్యూసర్లపై వడ్డీ భారం పెరగనుందా.. చిరు సినిమాకే ఎందుకిలా?