తమన్నా కాదు బాబోయ్.. జబర్దస్త్ అనసూయ కన్ఫర్మ్
TeluguStop.com
నందమూరి బాలకృష్ణ అఖండ మరియు వీర సింహారెడ్డి సినిమాలతో బ్యాక్ బ్యాక్ భారీ విజయాలను సొంతం చేసుకున్న నేపథ్యంలో తదుపరి సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రస్తుతం బాలకృష్ణ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.ఆ సినిమాకి ఇంకా టైటిల్ ని ఖరారు చేయలేదు.
విభిన్నమైన రెండు లుక్స్ లో బాలకృష్ణ కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.ముఖ్యంగా బాలకృష్ణ శ్రీలీలకు తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడు.
ఆ పాత్ర లుక్ అభిమానులను సర్ప్రైజ్ చేయడం ఖాయం అంటున్నారు.హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ కనిపించబోతోంది.
ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉన్నా కూడా కచ్చితంగా మంచి ప్రభావం చూపించే పాత్ర అవుతుంది అంటూ యూనిట్ సభ్యులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
ఇక బాలకృష్ణ కూతురు పాత్ర లో నటిస్తున్న శ్రీలీల విభిన్నమైన పాత్ర తో మెప్పించబోతోంది అంటూ యూనిట్ సభ్యులు చెప్తున్నారు.
"""/" /
ఇక ఈ సినిమా లో ఐటమ్ సాంగ్ ని మిల్కీ బ్యూటీ తమన్నా తో చేయించాలని దర్శకుడు అనిల్ రావిపూడి తీవ్రంగా ప్రయత్నించాడు.
కానీ అనిల్ రావిపూడి ప్రయత్నం సఫలం కాలేదు.తమన్నా ఏకంగా కోటిన్నర రూపాయలను పారితోషికంగా డిమాండ్ చేయడంతో ఆమె ప్లేస్ లో జబర్దస్త్ మాజీ యాంకర్ అనసూయ ని రంగంలోకి దించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
జబర్దస్త్ మాజీ యాంకర్ అనసూయ సినిమాలతో బిజీగా ఉంటుంది.ఆమె గతంలో ఐటెం సాంగ్స్ చేసి సక్సెస్ అయిన విషయం కూడా తెలిసిందే.
కనుక మరోసారి ఆమెని ఐటెం గా చూపించేందుకు దర్శకుడు అనిల్ రావిపూడి సిద్ధమయ్యాడు.
"""/" /
గతంలో ఆమె చేసిన సాంగ్స్ తో పోలిస్తే ఈసారి ఆమె చేయబోతున్న ఐటెం సాంగ్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.
బాలకృష్ణ మరియు అనసూయ ఐటెం సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.
కోటిన్నర రూపాయల ఖర్చు పెట్టి తమన్నా ని తీసుకొచ్చే బదులు తక్కువ ఖర్చుతో అనసూయతో చేసి.
పబ్లిసిటీ భారీగా చేస్తే అంతకు మించి క్రేజ్ దక్కే అవకాశం ఉంది అని దర్శకుడు అనిల్ రావిపూడి భావించినట్లుగా ఉన్నారు.
అందుకే అనసూయని రంగంలోకి దించబోతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.
Validation Check 2026-03-24 19:38:18