వాల్తేరు వీరయ్య వర్సెస్ వీరసింహారెడ్డి.. ఆ విషయంలో రెండింటికి క్లారిటీ లేదు

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవికి పోటీ అన్నట్లుగా నందమూరి బాలకృష్ణ కూడా తాను నటిస్తున్న గోపీచంద్ మలినేని దర్శకత్వం లో రూపొందుతున్న వీరసింహారెడ్డి సినిమా తో సంక్రాంతి బరిలో నిలవబోతున్నాడు.

ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతి కి తెలుగు ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ను అందిస్తాయని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు.

అయితే ఈ రెండు సినిమా ల యొక్క కథ ఏంటి.నేపథ్యం ఏంటి అనే విషయాల పట్ల ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు.

వాల్తేరు వీరయ్య సినిమా లో చిరంజీవి లుక్ చూస్తుంటే కథ ఎలా ఉంటుంది అనే ఒక అవగాహనకు రాలేక పోతున్నాం.

అలాగే గోపీచంద్ మలినేని ఏ కథ తో నందమూరి బాలకృష్ణ తో వీర సింహారెడ్డి సినిమా ను తెరకెక్కించాడో తెలియడం లేదంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు.

ఈ రెండు సినిమా ల స్టోరీ ఏంటి.నేపథ్యం ఏంటి తెలియకుండానే అభిమానులు కచ్చితం గా మా హీరో సినిమా హిట్ అంటే.

మా హీరో సినిమా హిట్ అంటూ మాట్లాడుకుంటున్నారు.టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు చేయబోతున్న సందడి కచ్చితం గా చరిత్ర సృష్టిస్తుంది అంటున్నారు.

ఈ రెండు సినిమా లను కూడా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.

"""/"/కొన్ని కారణాల వల్ల సంక్రాంతి కి ఒకటి లేదా రెండు రోజుల గ్యాప్ తోనే ఈ రెండు సినిమా లను విడుదల చేయాల్సి రావడం దారుణం అంటూ మైత్రి మూవీ మేకర్స్ వారు బాధ పడుతున్నారు.

కానీ హీరోల యొక్క ఇమేజ్ మరియు ఫ్యాన్స్ యొక్క డిమాండ్ కారణం గా రెండు సినిమా లను ఒకే సారి విడుదల చేయాల్సి వస్తుందని మైత్రి వారు ఇటీవల ఒక ప్రెస్ మీట్ లో తెలియజేశారు.

కచ్చితం గా ఈ రెండు సినిమా లు నువ్వా నేనా అన్నట్లుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తెగ హడావుడి చేయడం ఖాయం.

కానీ ఇప్పటి వరకు ఈ సినిమా ల యొక్క కథ ఏంటి.హీరోల పాత్రలు ఏంటి అనే విషయాలు మాత్రం క్లారిటీ రావడం లేదు.

Kodali Nani : ఇళ్ల పట్టాల విషయంలో టీడీపీపై కొడాలి నాని సీరియస్ వ్యాఖ్యలు..!!