మెగా వర్సెస్ నందమూరి.. రెండున్నర నెలల ముందే మొదలైన రచ్చ
TeluguStop.com
వచ్చే సంవత్సరం సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య విడుదల కన్ఫామ్ అయ్యింది.
అంతే కాకుండా బాలకృష్ణ నటిస్తున్న వీర సింహా రెడ్డి సినిమా కూడా సంక్రాంతి కి విడుదల కాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.
ఈ రెండు సినిమాలు సంక్రాంతి పోటీ లో ఉంటే కచ్చితం గా అభిమానులకు పండుగ రెట్టింపు అవ్వడం ఖాయం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గతం లో వీరిద్దరూ సంక్రాంతి కి పలు సార్లు పోటీ పడ్డారు.సంక్రాంతి విజేతాలుగా చిరంజీవి మరియు బాలకృష్ణ లు సమానం గా నిలిచారు అనడం లో సందేహం లేదు.
ఈసారి సంక్రాంతికి రెండున్నర నెలల ముందుగానే మెగా వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ సందడి మొదలైంది.
"""/"/
తాజాగా విడుదలైన వాల్తేరు వీరయ్య ప్రోమో నుండి విజువల్స్ మరియు వీర సింహా రెడ్డి సినిమా యొక్క విజువల్స్ తీసుకొని తెగ కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ మెగా మరియు నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు.
తెలుగు బాక్సాఫీస్ వద్ద వీరిద్దరూ గతం లో చేసిన సందడి అంతా అంతా కాదు.
సీనియర్ హీరో లు అయినా కూడా వీరిద్దరికీ ఉన్న పాపులారిటీ యంగ్ స్టార్ హీరోలకు కూడా లేదు అనడం లో సందేహం లేదు.
అంతటి క్రేజ్ ఉన్న వీరిద్దరూ సంక్రాంతి కానుకగా వారి మాస్ సినిమా లతో ప్రేక్షకుల ముందుకు వస్తే అభిమానుల్లో ఉండే హడావుడి అంతా కాదు.
ఏ స్థాయిలో సంక్రాంతికి రచ్చ ఉంటుందో ఇప్పటి నుండే వారి ఫాన్స్ చేస్తున్న హడావుడిని చూస్తుంటే అర్థమవుతుంది.
వచ్చే సంక్రాంతికి ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా మరో రెండు మూడు సినిమాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఓరి దేవుడా.. ఒక్క చేప ఖరీదు 11 కోట్లా?