బాలయ్య అఖండ 2.. ఇప్పుడే కాదు బాబోయ్, అవన్నీ పుకార్లే
TeluguStop.com
నందమూరి బాలకృష్ణ( Balakrishna ).బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
ఆ సినిమా కి సీక్వెల్ ను బాలయ్య మరియు బోయపాటి ప్రకటించారు.ప్రస్తుతం బోయపాటి దర్శకత్వం లో రామ్ హీరో గా ఒక సినిమా రూపొందుతోంది.
ఆ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి.ఈ ఏడాది చివర్లోనే అఖండ సినిమా యొక్క సీక్వెల్ ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని.
అంతే కాకుండా సినిమా యొక్క కీలక పాత్రలో మోక్షజ్ఞ( Nandamuri Mokshagna ) ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
"""/" / ప్రస్తుతం సినిమా కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లుగా కూడా బోయపాటి నుండి సమాచారం అందుతోంది.
అయితే సినిమా ప్రారంభం ఎప్పుడు అనే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు.
అఖండ 2( Akhanda 2 ) సినిమా ఉంది.కానీ కచ్చితంగా ఇప్పట్లో లేదు అంటూ చాలా మంది వారు చెబుతున్నారు.
అంతే కాకుండా అఖండ 2 లో మోక్షజ్ఞ నటించబోతున్నాడు అంటూ వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదు అంటూ ప్రకటించారు.
"""/" /
మోక్షజ్ఞ హీరోగానే ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.
ఆకట్టుకునే ఫిజిక్ మరియు నటన లో మంచి ప్రావిణ్యం వచ్చిన తర్వాత మాత్రమే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని కూడా నందమోరి ఫ్యామిలీ వారు చెబుతున్నారు.
"""/" /
బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే.
ఆ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మరి కొన్ఇన రోజుల్లోనే పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి.
అఖండ సినిమా సీక్వెల్ ను బాలయ్య చేయాలని అనుకుంటున్నాడు.కానీ వెంటనే హడావుడి చేసి ఆ సినిమా ను చేయడం ద్వారా ఫలితం సరిగ్గా ఉండదేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అందుకే మెల్లగానే సినిమాను చేయాలని నిర్ణయించుకున్నారు.