బాలకృష్ణ, బాబీ కాంబో మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్‌

నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) అఖండ( Akhanda ) మరియు వీర సింహారెడ్డి సినిమాలో భారీ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

దసరాకు రాబోతున్న భగవంత్ కేసరి సినిమా తో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భగవంత్ కేసరి షూటింగ్ చివరి దశకు చేరింది.

ఎప్పుడైతే కేసరి ముగుస్తుందో అప్పుడే వెంటనే బాబీ దర్శకత్వం లో సినిమాను ప్రారంభించాలని భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

"""/" / దసరాకు భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) రాబోతుండగా, అప్పటి వరకు ఒక షెడ్యూల్‌ ముగిసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ నటిస్తున్న బాబీ సినిమా ను మార్చి వరకు పూర్తి చేయాలని భావిస్తున్నారు.

సమ్మర్ లో సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది ఏపీ లో జరుగబోతున్న అసెంబ్లీ ఎన్నికల హడావుడి సమయంలోనే బాబీ సినిమా రాబోతుందట.

మొదట ఆ సమయంలో బోయపాటి శ్రీను( Boyapati Srinu ) సినిమా వస్తే బాగుంటుందని అంతా భావించారు.

"""/" / కానీ బోయపాటి సినిమా వస్తే రాజకీయంగా వివాదాస్పదం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.

మొత్తానికి బాలయ్య మరియు బాబీ కాంబో సినిమా ను వచ్చే ఏడాది సమ్మర్ లో ఏదో ఒక సమయంలో విడుదల చేయడం కన్ఫర్మ్‌.

దర్శకుడు బాబీ విభిన్నమైన కాన్సెప్ట్‌ లను ఎంపిక చేసుకుని చాలా స్పీడ్ గా సినిమాలను చేస్తూ ఉంటాడు.

కనుక ఈ సారి కూడా తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకునే విధంగా బాలయ్య తో సినిమాను చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

బాలయ్య గత చిత్రాల ఫలితాల నేపథ్యం లో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.

కనుక భారీ బడ్జెట్ తో రూపొందించేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.

పార్లమెంట్‌లో ఎన్ఆర్ఐలకు ప్రాతినిథ్యం ఉండాలి .. స్టాండింగ్ కమిటీ సిఫారసు