బాలయ్య 109 వచ్చేది ఎప్పుడో తెలుసా.. మళ్లీ హిట్‌ ఖాయం అంటున్న ఫ్యాన్స్‌

నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) నిన్నే 64 ఏళ్ల వయసు లో ఎంటర్ అయ్యాడు.

సాధారణంగా ఈ వయసులో నటీ నటులు కొందరు రిటైర్మెంట్‌ ను ప్రకటించి విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటారు.

కానీ బాలయ్య ఇప్పుడు కూడా మూడు పదుల వయసు లో ఎలా అయితే సినిమా లు చేశాడో అలాగే చేస్తున్నాడు.

చేయాలి అనుకుంటున్నాడు. """/" / బాలయ్య అఖండ మరియు వీర సింహారెడ్డి సినిమా లతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

ఇప్పుడు అదే రేంజ్‌ లో భగవంత్ కేసరి సినిమా( Bhagwant Kesari Movie ) తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.

భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా ను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

"""/" / మరో వైపు బాలయ్య కొత్త సినిమా బాబీ దర్శకత్వంలో( NBK109 Director Bobby ) మొదలు అయిన విషయం తెల్సిందే.

షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి కనుక వెంటనే షూటింగ్ ను ముగించి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య 109 సినిమా ను సంక్రాంతికి విడుదల చేసే తప్పకుండా విజయం సాధిస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే బాలయ్య గత చిత్రం వీర సింహారెడ్డి సంక్రాంతికి వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

అంతే కాకుండా దర్శకుడు బాబీ దర్శకత్వం లో రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా సంక్రాంతికే వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

కనుక బాలయ్య 109 సినిమా కనుక సంక్రాంతికి వస్తే కుమ్ముడు ఖాయం.మరో రెండు వందల కోట్ల సినిమా బాలయ్య కి పడటం ఖాయం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బాలయ్య మరియు బాబీ సినిమా హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.