బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’… పెదవి విరుస్తున్న నందమూరి ఫ్యాన్స్
TeluguStop.com
నందమూరి బాలకృష్ణ( Balakrishna ) వరుసగా అఖండ మరియు వీరసింహా రెడ్డి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఆ రెండు సినిమాలు కూడా వంద కోట్ల రూపాయలకు మించి కలెక్షన్స్ రాబట్టడం జరిగింది.
అందుకే బాలకృష్ణ అభిమానులు ఇప్పుడు ఆయన నటిస్తున్న సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న బాలకృష్ణ కొత్త సినిమా కి సంబంధించిన టైటిల్ ని ఈ నెల 9 లేదా 10 వ తారీఖున ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
"""/" / బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
అదే సందర్భంలో ఈ సినిమా యొక్క టైటిల్ ని అధికారికంగా ప్రకటించడం మాత్రమే కాకుండా సినిమా నుండి ఒక వీడియో ని కూడా విడుదల చేసేలా దర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
"""/" /
ఇక ఈ సినిమా కు చాలా పేర్లు వినిపించాయి.చివరికి ఈ సినిమా కు 'భగవంత్ కేసరి( Bhagwant Kesari )' అనే టైటిల్ ని కన్ఫామ్ చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
బాలయ్య సినిమా కు ఇలాంటి టైటిల్ ఏంటో అంటూ నందమూరి అభిమానులు పెదవి విరిచే అవకాశాలున్నాయి.
ఇప్పటికే కొందరు నందమూరి అభిమానులకు ఈ టైటిల్ లీక్ అవ్వడంతో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
దర్శకుడు అనిల్ రావిపూడి పై నందమూరి అభిమానులు గత కొన్నాళ్లుగా గరం గరం గా ఉన్నారు.
బాలయ్య సినిమా విషయం లో అనిల్ రావిపూడి( Anil Ravipudi ) శ్రద్ధ వహించడం లేదు.
అప్డేట్ ఇవ్వడం లేదు అంటూ కోపంగా ఉన్న వారికి ఇప్పుడు టైటిల్ కూడా సరిగా లేదనే ఉద్దేశంతో సినిమాపై అనుమానాలు కలుగక మానవు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
టైటిల్ విషయంలో అధికారిక ప్రకటన వచ్చేప్పటి వరకు పుకార్లను నమ్మవద్దని యూనిట్ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.