స్టార్ హీరో బాలకృష్ణ స్టామినా ఇదే.. 60వ రోజు కూడా భారీగా కలెక్షన్లు సాధిస్తూ?
TeluguStop.com
స్టార్ హీరో బాలకృష్ణకు మాస్ ప్రేక్షకులలో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.
అఖండ సక్సెస్ తర్వాత బాలయ్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది.ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.
హాట్ స్టార్ లో ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.అయితే మరో వైపు థియేటర్లలో అఖండ సినిమా ప్రభంజనం ఏ మాత్రం తగ్గలేదనే చెప్పాలి.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన ఈ సినిమా కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధించింది.
ఈ సినిమా విడుదలై అరవై రోజులు కాగా వీకెండ్ లో ఈ సినిమా ఊహించని స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.
ఏపీలోని కర్నూలు జిల్లా విక్టరీ థియేటర్ లో నిన్న ఫస్ట్ షో టికెట్ల కోసం ప్రేక్షకులు క్యూ లైన్ లో నిలబడ్డారు.
బాక్సాఫీస్ వద్ద మరే సినిమా అఖండకు పోటీ ఇవ్వడం లేదు.ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా బాలయ్య స్టామినాకు ఇదే నిదర్శనం అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
"""/" /
అఖండ తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో 100 రోజులు ప్రదర్శితమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
అఖండ రిజల్ట్ వల్ల అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. """/" /
మరోవైపు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబంధించి భారీ కటౌట్ ను ఏర్పాటు చేయడం జరిగింది.
చాలా రోజుల తర్వాత ట్రాక్టర్లలో ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లి సినిమా చూడటం అఖండ విషయంలో మాత్రమే జరిగిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
బాక్సాఫీస్ వద్ద అఖండ సినిమా అరుదైన రికార్డులను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.
భవిష్యత్తులో అఖండ సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కే అవకాశాలు అయితే ఉన్నాయి.
ఆ సినిమా కోసం బయటకొస్తున్న అల్లు అర్జున్.. బన్నీ స్పీచ్ హైలెట్ కానుందా?