బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి రానున్న అఖండ!

హీరో బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం అఖండ.బోయపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.

భారీ అంచనాల నడుమ డిసెంబర్ 2 న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

విడుదలైన రెండు రోజులకే ఈ సినిమా దాదాపుగా 40 కోట్ల గ్రాస్ ను రాబట్టింది.

ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను అందుకుంది.

అలాగే బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో మూడవ బ్లాక్ బస్టర్ సినిమాగా ఈ సినిమా నిలిచింది.

ఈ సినిమాలో పవర్ ఫుల్ డైలాగులు, బాలయ్య గెటప్ లు, ఫైట్ సీన్స్ అన్ని హైలెట్ గా నిలిచాయి.

ఈ సినిమా విడుదల అయ్యి వారం కావస్తున్నా కూడా సినిమా థియేటర్ ల వద్ద హౌస్ ఫుల్ బోర్డు లు దర్శనమిస్తున్నాయి.

ఆన్లైన్ లో సైతం టికెట్లు దొరకడం కష్టంగా ఉంది.ఈ సినిమా విడుదల అయ్యి కేవలం వారం రోజుల్లోనే రూ.

85 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్ల చేసినట్లు సమాచారం. """/"/ చాలా రోజుల తర్వాత బాలకృష్ణ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్‌ పడడంతో నందమూరీ అభిమానుల ఆనందానికి హద్దులేకుండా పోతుంది.

ఈ క్రమంలోనే తాజాగా అఖండ్ మూవీ గురించిన మరో క్రేజీ అప్‌డేట్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ చిత్రం ఓటీటీలో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.2022 కొత్త సంవత్సరం కానుకగా ఈ సినిమా ఓటీటీలో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అఖండ స్ట్రీమింగ్‌ కానుందట.ఈ విషయం పై త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

AP BJP : ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో ట్విస్టులివే.. ఈ అభ్యర్థులకు గెలుపు సులువు కాదంటూ?