అఖండ నైజాం వసూళ్ల అంచనా..!
TeluguStop.com
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చి' అఖండ' సినిమాకు అన్నిచోట్ల సూపర్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పొచ్చు.
సరైన మాస్ సినిమా కోసం ఎదురుచూస్తున్న తెలుగు ఆడియెన్స్ ఆకలి తీర్చేలా 'అఖండ' అదిరిపోయిందని అంటున్నారు.
సినిమాలో పెద్దగా కథ కొత్తగా ఏమి లేకున్నా బాలయ్య ఊర మాస్ యాక్షన్ తో థియేటర్ లు దద్దరిల్లిపోయేలా చేస్తున్నాయి.
ప్రీమియర్స్ షో బుకింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఈ సినిమా సంచలన విజయం అని చెప్పేలా వసూళ్లు ఉన్నాయి.
ఇక నైజాం లో' అఖండ' సినిమా మొదటి రోజు 5.5 కోట్ల దాకా వసూళ్లు చేసే అవకాశం ఉందని అంటున్నారు.
బాలకృష్ణ కెరియర్ లో హయ్యెస్ట్ ఫస్ట్ డే కలక్షన్స్ రాబట్టిన సినిమాగా అఖండ వస్తుందని చెప్పొచ్చు.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత స్టార్ హీరో సినిమాగా' అఖండ'కు ఆడియెన్స్ నుండి బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యూఎస్ లో కూడా 'అఖండ' హంగామా అదే రేంజ్ లో ఉంది.
యూఎస్ లో ప్రీమియర్స్ షోతోనే 300k మిలియన్ మార్క్ సాధించింది అఖండ.చూస్తుంటే అఖండ అద్వితీయమైన విజయాన్ని అందుకునేలా ఉంది.
సినిమాలో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటించగా శ్రీకాంత్ విలన్ గా నటించి మెప్పించారు.
ఓరి దేవుడా.. సిటీ స్కాన్ రిపోర్టు చూసి అబ్బురపోయిన డాక్టర్లు..