అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమైన రికార్డ్ ఇప్పుడు బాలయ్యకు సాధ్యమైందా?

సినిమా రంగానికి చెందిన స్టార్ హీరోలు కొత్త రికార్డులను క్రియేట్ చేయడం సులువైన విషయం కాదు.

ప్రస్తుతం హిట్ టాక్ వచ్చిన సినిమాలు సైతం థియేటర్లలో వారానికే పరిమితమవుతున్న నేపథ్యంలో స్టార్ హీరోలు తక్కువ సమయంలోనే తమ సినిమాలు ఎక్కువ కలెక్షన్లను సాధించాలని భావిస్తున్నారు.

ఫలితంగా రెండు వారాల తర్వాత మరో పెద్ద సినిమా రిలీజైతే హిట్ టాక్ వచ్చిన సినిమాలు సైతం థియేటర్ల నుంచి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే తాజాగా బాలకృష్ణ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది.బాలయ్య నటించిన అఖండ థియేట్రికల్ కలెక్షన్లతో పాటు నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా 200 కోట్ల క్లబ్ లో చేరడంతో పాటు ఈరోజు నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ 100కు పైగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.

తెలుగులో తొలి ద్విశ‌త‌దినోత్స‌వం జరుపుకున్న సినిమా పాతాళభైరవి కాగా లవకుశ సినిమా థియేటర్లలో ఏకంగా 60 వారాలు ఆడిన సినిమాగా నిలిచింది.

సీనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు స్వర్ణోత్సవాలు జరుపుకోవడంతో పాటు రికార్డులు క్రియేట్ చేశాయి.

ఈ తరం హీరోలలో బాలకృష్ణ నటించిన లెజెండ్ మూవీ ఏకంగా 1005 రోజులు థియేటర్లలో ప్రదర్శితమై రికార్డును సొంతం చేసుకుంది.

కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో అఖండ రికార్డు స్థాయిలో థియేటర్లలో 50 రోజుల వేడుకను జరుపుకుంటోంది.

"""/"/.ఈ విధంగా అటు సీనియర్ ఎన్టీఆర్ ఇటు బాలయ్య అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

కర్నూలు, గుంటూరు, వైజాగ్ లాంటి ఏరియాలలో కూడా అఖండ మూవీ ప్రదర్శించబడుతుండటం గమనార్హం.

అఖండ హాట్ స్టార్ ఓటీటీలో ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి అందుబాటులోకి రానుంది.

అఖండ మూవీ ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకోవడంతో బాలయ్య అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు.

హాట్ స్టార్ లో అఖండకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తాయని అభిమానులు అనుకుంటున్నారు.

మునుపటి కంటే బలంగా ఉన్నా.. చైతూతో విడాకులపై సమంత కామెంట్స్ వైరల్!