'అఖండ' ఫస్ట్ సింగిల్ ను బాలయ్య పుట్టినరోజుకు షిఫ్ట్ చేసారా..?

నటసింహం నందమూరి బాలకృష్ణ గత కొన్ని రోజులుగా హిట్స్ లేక బాధపడుతున్నాడు.ఈయన సినిమాలు విడుదల అయినా కూడా జనాలు అంతగా పట్టించుకోవడం లేదు.

హిట్స్ లేక ఆయన మార్కెట్ కూడా తగ్గిపోయింది.కానీ బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న అఖండ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఎందుకంటే ఈ సినిమాను యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్నాడు.ఇప్పటికే బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ సినిమాలు హిట్ అయ్యాయి.

ఇప్పుడు అఖండ సినిమాపై కూడా ఇలాంటి అంచనాలే ఉన్నాయి.ఉగాది కానుకగా ఈ సినిమా టీజర్ విడుదల అయ్యి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఈ టీజర్ చూసిన తర్వాత ఇది కూడా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.

బాలయ్య ఈ సినిమాలో ఇంత వరకు చూడని సరికొత్త లుక్ లో కనిపించాడు.

"""/"/ ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సయేశా సైగల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.థమన్ సంగీతం అందిస్తుండడంతో ఈ సినిమా పాటల విషయంలో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రాబోతుందని ఎప్పటి నుండో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మొన్నటి వరకు ఈ సినిమా ఫస్ట్ సింగిల్ మే 28 న వస్తుందని వార్తలు వచ్చాయి.

కానీ నిన్న కూడా ఈ అప్డేట్ రాలేదు.ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ సింగిల్ బాలయ్య బాబు పుట్టిన రోజుకు షిఫ్ట్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి.

జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు కావడంతో ఆ రోజే ఈ సినిమా నుండి అప్డేట్ రాబోతుందని వార్తలు వస్తున్నాయి.

మరి చూడాలి ఈ సినిమా అప్డేట్ అప్పుడైనా వస్తుందో లేదో.

కొలంబియా వర్సిటీలో ఇజ్రాయెల్ వ్యతిరేక అల్లర్లు .. భారీగా అరెస్ట్‌లు, న్యూయార్క్ పోలీసులపై ట్రంప్ ప్రశంసలు