అఖండ హిట్ మెగా ఫ్యాన్స్ హ్యాపీ..!

బాలకృష్ణ అఖండ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నందుకు కేవలం నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు మెగా ఫ్యాన్స్ కూడా ఆనందంగా ఉన్నారు.

కరోనా తర్వాత పెద్ద హీరోల సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో అన్న టెన్షన్ ఉండగా బాలయ్య స్టామినా చూపించేలా వసూళ్లు కనబడుతున్నాయి.

ఇక ఇది ఓ రకంగా రానున్న మెగా హీరోల సినిమాలు పుష్ప, ఆర్.

ఆర్.ఆర్, ఆచార్య సినిమాలకు ప్లస్ అవనుంది.

ఇక మరోపక్క అఖండ సినిమాకు మెగా హీరోలకు రిలేషన్ ఏర్పడింది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగా హీరో ,ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చాడు.

సినిమా ఫలితం వేరేగా ఉంటే కామెంట్స్ ఎలా వచ్చేవో కాని సినిమా బంపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈవెంట్ కు వచ్చిన అల్లు అర్జున్ గురించి కూడా పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

ఈ లెక్కన రాబోతున్న పుష్ప సినిమాకు కూడా నందమూరి ఫ్యాన్స్ సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.

ఇలా ఒక హీరో సినిమాకు మరో హీరో ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తే ఇండస్ట్రీ బాగుంటుందని చెప్పొచ్చు.

 అంతేకాదు అఖండ ఉత్సాహం చూసి మెగా ఫ్యాన్స్ కూడా తమ హీరో సినిమాలను ఇదే రేంజ్ ఓపెనింగ్స్ తెచ్చేలా హంగామా చేస్తారని చెప్పొచ్చు.

పెళ్లి మండపం పై రచ్చ చేసిన పెళ్లికూతురు ప్రియుడు చివరకు.. వైరల్ వీడియో..